పెట్టుబడులపై అధిక రాబడి వస్తుందనే సాకుతో మహారాష్ట్రకు చెందిన ఓ మహిళా ఐఏఎస్ అధికారిని మోసం చేసి సుమారు రెండు కోట్ల రూపాయల మేర దోచుకున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆమె ఫిర్యాదు మేరకు ఢిల్లీలోని తిలక్ మార్గ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు.
READ MORE: Kamala Harris: ఇంకా 72 రోజులే కమల పదవీకాలం! నెక్ట్స్ ప్లాన్ ఏంటి?
పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. ఐఏఎస్ అధికారి గురుగ్రామ్‌లో నివసిస్తున్న బంధువు ద్వారా మోసగాడిని కలిశారు. అతడు తనను తాను స్టాక్ మార్కెట్‌లో నిపుణుడిగా అభివర్ణించుకున్నాడు. మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి చాలా డబ్బు సంపాదించినట్లు మాయ మాటలు చెప్పి నమ్మించాడు. తన వల్ల తన స్నేహితులకు, ఇతర పెట్టుబడిదారులకు ఎంత రాబడి వచ్చిందో తన ల్యాప్‌టాప్‌లో ఆమెకు చూపించాడు. 60 నుంచి 70 కోట్ల వరకు పెట్టుబడి పెట్టి.. దాన్ని రూ.100 కోట్లకు తీసుకెళ్లాలనుకుంటున్నానని చెప్పాడు. అతనికి సొంత లైసెన్స్ కూడా ఉన్నట్లు చూపించాడు. తనకు అప్పు ఇస్తే అధిక రాబడులు కూడా ఇస్తానని సదరు వ్యక్తి మహిళా ఐఏఎస్ అధికారిణిని ఒప్పించాడు. తన డబ్బు భద్రంగా ఉంటుందని హామీ ఇచ్చాడు.
READ MORE: Multibagger Stock: రూ. లక్ష పెట్టుబడితో రూ. 70 లక్షల రాబడి!.. అది కూడా కేవలం 14 నెలల్లోనే..
దీంతో ఆమె 2023 సెప్టెంబర్‌లో ఆ వ్యక్తి ఖాతాకు రూ.1.9 కోట్లు బదిలీ చేశారు. 2024 ఆగస్టు నాటికి రెట్టింపు లాభాలను తిరిగి ఇస్తానని ఆ వ్యక్తి ఐఏఎస్‌కు చెప్పాడు. ఇప్పటికే తనకు రూ.75 లక్షల లాభం వచ్చిందని నమ్మించాడు. జనవరి 2024లో ఐఏఎస్ అధికారిణి తనకు వైద్యపరమైన ఖర్చులకు నగదు కావాలని కోరారు. కానీ.. ఆ మోసగాడు డబ్బులు ఇవ్వకుండా ఏవేవో సాకులు చెబుతూ తేదీని పొడిగిస్తూనే ఉన్నాడు. 2024 మార్చిలో వారికి రూ.25 లక్షలు కూడా ఇచ్చాడు. త్వరలోనే డబ్బులన్నీ తిరిగి ఇచ్చేస్తానని చెప్పాడు. అయితే తర్వాత సాకులు చెప్పడం మొదలుపెట్టాడు. తాను మోసపోయినట్లు గ్రహించిన ఐఏఎస్ అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.