A Delivery Boy Badly Injured In A Dog Attack In Hyderabad: ఈమధ్య కొన్ని కుక్కలు సృష్టిస్తున్న వీరంగం అంతాఇంతా కాదు. ఏం చేయకపోయినా.. జనాలపై ఎగబడి, దాడులకు దిగుతున్నాయి. తీవ్రంగా గాయపరుస్తున్నాయి. తాజాగా ఒక కుక్క చేసిన పనికి.. ఓ డెలివరీ బాయ్ మూడో అంతస్తు నుంచి దూకేశాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Honey Rose: చక్కగా అందరికి హానీ పూసి.. సెటిల్ అయిపోయిందే
బంజారాహిల్స్ రోడ్ నం.6లోని లుంబిని ర్యాక్ క్యాజిల్ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న శోభన నాగాని.. ఈనెల 11వ తేదీన ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో మహ్మద్ రిజ్వాన్(23) అనే డెలివరీ బాయ్, పార్శిల్ ఇవ్వడానికి ఇంటికి చేరుకున్నాడు. బయట నిల్చొని డోర్ బెల్ కొట్టాడు. అయితే.. ఆ ఇంటి తలుపులు ముందునుంచే తీసి ఉంది. ఎవ్వరూ కనిపించకపోయేసరికి.. రిజ్వాన్ డోర్ బెల్ మోగించాడు. ఆ శబ్దం విని.. ఇంట్లో ఉన్న జర్మన్ షెపర్డ్ కుక్క ఒక్కసారిగా దూసుకొచ్చింది. ఆ డెలివరీ బాయ్‌ని కరిచేందుకు ఎగబడింది. ఈ పరిణామంతో తీవ్ర ఆందోళనకు గురైన రిజ్వాన్.. ఆ కుక్క నుంచి తప్పించుకునేందుకు పరుగు లంకించాడు. ఆ కుక్క తన వెంట పడటంతో, ఏం చేయాలో పాలుపోక మూడో అంతస్తు నుంచి కిందకు దూకేశాడు.
Love Jihad: మతం మారనన్నందుకు.. భర్త కీచకపర్వం
ఈ ప్రమాదంలో అతడు కారిడార్ రెయిలింగ్ నుంచి జారి కిందపడ్డాడు. దీంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న రిజ్వాన్ కుటుంబసభ్యులు.. ఆ కుక్క యజమానురాలు శోభనపై కేసు పెట్టారు. తన కుక్కను కట్టేయకుండా నిర్లక్ష్యంగా వదిలేయడం వల్లే, తన సోదరుడికి తీవ్ర గాయాలయ్యాయని రిజ్వాన్ సోదరుడు ఖాజా తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. దీంతో.. పోలీసులు శోభనపై ఐపీసీ సెక్షన్ 336, 289 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Purple Cabbage: ఊదారంగు క్యాబేజీ తింటే.. ఆ ప్రాబ్లమ్ ఉండదా..!