Site icon NTV Telugu

Krishna District Crime: ప్రియురాలి ఇంట్లో ప్రియుడి ఆత్మహత్య.. ఏం జరిగింది..?

Suicide

Suicide

Krishna District Crime: ప్రియురాలి ఇంట్లోనే ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉయ్యూరులో కలకలం రేపుతోంది.. గతంలో ప్రేమించుకున్న ఓ జంట.. మనస్పర్ధలు రావడంతో 2021లో విడిపోయారు.. అప్పటి నుంచి వాళ్లు దూరంగానే ఉంటున్నారని చెబుతున్నారు.. అయితే, గత రాత్రి తన మాజీ ప్రియురాలి ఇంటికి వెళ్లిన ప్రియుడు.. తనకు ఇచ్చి పెళ్లి చేయాలని.. సదరు యువతి కుటుంబ సభ్యులను అడిగాడు.. కానీ, వాళ్లు పెళ్లికి నిరాకరించడంతో.. అక్కడే ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెబుతున్నారు..

Read Also: EPFO Job Notification: కేవలం ఇంటర్య్వూ ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వనున్న ఈపిఎఫ్ఓ

కృష్ణా జిల్లా ఉయ్యూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉయ్యూరుకు చెందిన చందా మాధవ రాజు(30) కోరపాటు మాధవి (28) ప్రేమించుకున్నారు.. ఇద్దరికీ మనస్పర్ధలు వచ్చి 2021లో విడిపోయారు. అయితే, గత రాత్రి మాధవి వాళ్ల ఇంటికి వెళ్లి మృతుడు.. తనకు మాధవికి పెళ్లి చేయమని అడిగాడు.. దీనికి మాధవి కుటుంబ సభ్యులు నిరాకరించారు.. ఇక, అర్ధరాత్రి సమయంలో మాధవి వాళ్ల ఇంటి వరండాలో ఫ్యాన్ కు ఉరివేసుకొని చనిపోయాడు మాధవ రాజు.. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.. ఇక, మాధవరాజు మృతదేహాన్ని ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు.. అయితే, స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది..

Exit mobile version