కొత్తగా పెళ్లి చేసుకున్న ఆ పెళ్లి కూతురు అత్త గారింట్లో అడుగుపెట్టిన క్షణం నుంచి శాడిస్ట్ భర్తతో వేధింపులు మొదలయ్యాయి. ఆశలతో మెట్టినింట అడుగు పెట్టిన వధువుకు అనుక్షణం అవమానాలే ఎదురయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగి అయిన భర్త విచక్షణ మరచి నువ్వు అందంగా లేవు. నాకు పరిచయం ఉన్న సాయి అనే అమ్మాయి అందం ముందు నీవెందుకు పనికిరావు అంటూ కొట్టి దూషించడం, అడ్డు చెప్పాల్సిన అత్తామామ అతనికి అండగా నిలబడటం చూసి తట్టుకోలేకపోయింది.
Vuyyuru Domestic Violence: కృష్ణా జిల్లా ఉయ్యూరులో నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. శాడిస్ట్ భర్త రాంబాబు చిత్రహింసలు భరించలేక ఉరివేసుకొని శ్రీవిద్య ఆత్మహత్య చేసుకుంది. రాంబాబు అకృత్యాలను సూసైడ్ లెటర్‌లో శ్రీవిద్య వివరించింది. తల్లిదండ్రులకు భారం కాకూడదనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, శాడిస్ట్ భర్తను వదలొద్దని లెటర్‌లో శ్రీవిద్య రాసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. Also Read: Jagadish Reddy vs Kavitha: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు జగదీష్…
ప్రియురాలి ఇంట్లోనే ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉయ్యూరులో కలకలం రేపుతోంది.. గతంలో ప్రేమించుకున్న ఓ జంట.. మనస్పర్ధలు రావడంతో 2021లో విడిపోయారు.. అప్పటి నుంచి వాళ్లు దూరంగానే ఉంటున్నారని చెబుతున్నారు.. అయితే, గత రాత్రి తన మాజీ ప్రియురాలి ఇంటికి వెళ్లిన ప్రియుడు.. తనకు ఇచ్చి పెళ్లి చేయాలని.. సదరు యువతి కుటుంబ సభ్యులను అడిగాడు.. కానీ, వాళ్లు పెళ్లికి నిరాకరించడంతో.. అక్కడే ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెబుతున్నారు..
ఏపీలో కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరులో వీరమ్మతల్లి సిడిబండి మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. పారుపూడి కనక చింతయ్య సమేత శ్రీ వీరమ్మ తల్లి పేరంటాల మహోత్సవ వేడుకలు గత 11 రోజులుగా ఉయ్యూరు పట్టణంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.