Machilipatnam Robbery Gang: మైనర్లకు లిక్కర్, గంజాయి అలవాటు చేసి వారితో చోరీలు చేయిస్తున్న ముఠా ఆటకట్టించారు కృష్ణాజిల్లా పోలీసులు. దీంతో మచిలీపట్నంలో ఏడాదిగా సాగుతున్న దొంగతనాలకు చెక్ పెట్టారు. భారీగా బంగారం, నగదును సీజ్ చేశారు. ఇక్కడ చూడండి.. గోల్డ్ చైన్లు, చెవి కమ్మలు, ఉంగరాలు, లాకెట్స్ లాంటి వాటితోపాటు వెండి వస్తువులు దొంగతనాలు చేస్తున్నారు.
ప్రియురాలి ఇంట్లోనే ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉయ్యూరులో కలకలం రేపుతోంది.. గతంలో ప్రేమించుకున్న ఓ జంట.. మనస్పర్ధలు రావడంతో 2021లో విడిపోయారు.. అప్పటి నుంచి వాళ్లు దూరంగానే ఉంటున్నారని చెబుతున్నారు.. అయితే, గత రాత్రి తన మాజీ ప్రియురాలి ఇంటికి వెళ్లిన ప్రియుడు.. తనకు ఇచ్చి పెళ్లి చేయాలని.. సదరు యువతి కుటుంబ సభ్యులను అడిగాడు.. కానీ, వాళ్లు పెళ్లికి నిరాకరించడంతో.. అక్కడే ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెబుతున్నారు..