Site icon NTV Telugu

UP: ఇన్‌స్టాలో వివాహితతో ప్రేమ.. హోటల్‌కు పిలిచి ప్రియుడు ఏం చేశాడంటే…!

Upwomen

Upwomen

భారతీయ సాంప్రదాయంలో వైవాహిక జీవితం చాలా ప్రత్యేకమైంది. భార్యాభర్తల బంధాన్ని చాలా పవిత్రంగా చూస్తారు. అలాంటి బంధాన్ని కొందరు క్షణిక సుఖం కోసం పచ్చని సంసారాలను కూల్చుకుంటున్నారు. ప్రియుడి మోజులో పడి కట్టుకున్నవాళ్లనే కడతేర్చేస్తున్నారు. ఇక కొందరైతే కామంతో కళ్లు మూసుకుపోయి.. వయసు పైబడిన వారు కూడా అడ్డదారులు తొక్కుతున్నారు. సోషల్ మీడియా ప్రభావమో.. లేదంటే పరిస్థితుల ప్రభావమో తెలియదు గానీ.. లేటు వయసులో ఒక మహిళ ప్రేమలో పడి ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: MLC Kavitha: మధ్యాహ్నం కవిత ప్రెస్‌మీట్.. బీఆర్ఎస్‌ నేతలే టార్గెటా?, ఫ్యూచర్ ప్లాన్స్ చెప్పేనా?

ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో ఫరూఖాబాద్‌కు చెందిన రాణి అనే మహిళ (52).. ఇన్‌స్టాగ్రామ్‌లో 26 ఏళ్ల అరుణ్ రాజ్‌పుత్‌తో ప్రేమలో పడింది. వయసును దాచిపెట్టి అతడితో లవ్‌లో పడింది. తొలుత ఆన్‌లైన్‌లో సంభాషణలు కొనసాగించారు. అనంతరం ఫరూఖాబాద్‌లో హోటళ్లలో కలుస్తుండేవారు. నలుగురు పిల్లలు ఉన్నారన్న విషయాన్ని దాచిపెట్టి రాజ్‌పుత్‌తో సంబంధాన్ని కొనసాగించింది. ఈ క్రమంలోనే రాజ్‌పుత్‌కు రూ.1.5 లక్షలు సాయం చేసింది.

ఇది కూడా చదవండి: Kadapa: వినాయకుడి విగ్రహంపై రప్పా.. రప్పా..!

ఇక ఇద్దరి మధ్య బంధం బలపడుతుండగా పెళ్లి చేసుకోవాలంటూ రాజ్‌పుత్‌పై రాణి ఒత్తిడి తెస్తోంది. అంతేకాకుండా తీసుకున్న డబ్బు కూడా తిరిగి ఇచ్చేయాలని కోరుతోంది. దీంతో ప్రియుడు ఒత్తిడికి గురయ్యాడు. ఆమెను అడ్డుతొలగించుకోవాలని ప్రణాళిక రచించాడు. ఆగస్టు 10న రాణిని మైన్‌పురికి పిలిచాడు. మళ్లీ అదే విషయాన్ని ఆమె ప్రస్తావించింది. పెళ్లి చేసుకోవాలని కోరింది. అంతేకాకుండా డబ్బు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి పెంచింది. దీంతో కోపోద్రేకుడైన రాజ్‌పుత్.. రాణి గొంతు కోసి పరారయ్యాడు.

ఇది కూడా చదవండి: Trump: భారత్‌ టారిఫ్‌లపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. వైట్‌హౌస్‌లో మీడియా ప్రశ్నకు సమాధానమిదే!

ఇక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మహిళ ఎవరనేది గుర్తించేందుకు పోస్టర్లను అతికించారు. అనంతరం ఫరూఖాబాద్‌లో తప్పిపోయిన ఫిర్యాదుతో పోల్చగా.. రాణి అని తేలింది. ఇక రాణి మొబైల్, సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా ప్రేమ వ్యవహారం బయటపడింది. కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తుండగా బుధవారం అరెస్ట్ చేశారు. ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణలు జరిగాయని.. ఫొటోలు, చాట్‌లు ఉన్నాయని చెప్పారు.

ఏడాదిన్నర క్రితం ఇద్దరి మధ్య ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడిందని.. అనంతరం హోటళ్లలో కలుస్తుండడంతో ఇద్దరి మధ్య బంధం ఏర్పడినట్లుగా పోలీసులు తెలిపారు. ప్రియుడికి సాయం చేసిందని.. అలాగే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ప్రియుడు చంపేసినట్లుగా వెల్లడించారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.

Exit mobile version