NTV Telugu Site icon

Uttar Pradesh: భార్యను కాల్చేసి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు.. కొన ఊపిరితో ఉన్నా కాపాడని ప్రజలు

Uttar Pradesh

Uttar Pradesh

Uttar Pradesh: భార్య భర్తల మధ్య గొడవ వారిద్దరి ప్రాణాలు తీసింది. పెళ్లై 5 నెలలైనా కాలేదు, అప్పుడే ఆ దంపతుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో భర్త, భార్యను కాల్చి చంపేసి, ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ముజఫర్ నగర్ జిల్లా మఖ్యాలి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది.

ఎస్పీ అతుల్ శ్రీవాస్తవ తెలిపిన వివరాల ప్రకారం.. 26 ఏళ్ల నసీమ్ మాలిక్ ఐదు నెలల క్రితం 25 ఏళ్ల నర్గీస్ ను వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లికి సద్దాం అనే వ్యక్తి మధ్యవర్తిత్వం వహించాడు. శుక్రవారం నసీమ్, నర్గీల మధ్య గొడవ జరిగింది. వీరిద్దరు మధ్యవర్తిత్వం వహించిన సద్దాం ఇంటికి వెళ్లారు. అయితే వీరిద్దరికి సర్ది చెప్పలేక అతను అక్కడి నుంచి పారిపోయాడు.

Read Also: Maga Princes: మనవరాలి పేరును అధికారికంగా ప్రకటించిన చిరంజీవి

సద్దాం ఇంటి వద్దే దంపతులు మళ్లీ గొడవ ప్రారంభించారు. ఇద్దరిని శాంతింప చేయడానికి పొరుగున ఉండే సాబీర్ అక్కడికి వచ్చాడు. ఆ సమయంలో సాబీర్ పై నసీమ్ కాల్పులకు పాల్పడ్డాడు. ఈ కాల్పుల్లో సాబీర్ గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన తర్వాత నసీమ్ తన బైక్ పై నర్గీస్ తో అక్కడి నుంచి బయలుదేరాడు. కొంతదూరం వెళ్లాక బండి ఆపేసి నర్గీస్ ని కాల్చి చంపాడు. ఆ తరువాత నసీర్ కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు వివరించారు. తీవ్రగాయాలైన నర్గీస్ అక్కడే కొట్టుమిట్టాడుతూ మరణించింది. సమీపంలో ఉన్న ప్రజలు ఈ ఉదంతాన్ని రికార్డ్ చేశారే తప్పితే.. కాపాడే ప్రయత్నం చేయలేదు.

ఘటనా స్థలం నుంచి రెండు పిస్టల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు సూపరింటెండెంట్ (రూరల్) అతుల్ శ్రీవాస్తవ తెలిపారు. పెళ్లి దగ్గర నుంచి సంసారంలో గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

Show comments