NTV Telugu Site icon

Delhi: 4 ఏళ్ల బాలికపై ప్యూన్ అఘాయిత్యం..

Delhi

Delhi

Delhi: దేశంలో చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలకు అడ్డుకట్టపడటం లేదు. అభంశుభం తెలియని చిన్నారులు పాలిట మృగాళ్లు కర్కశంగా వ్యవహరిస్తున్నారు. పోక్సో, నిర్భయ వంటి చట్టాలు ఉన్నా కూడా కామాంధులు జంకడం లేదు. దేశంలో రోజుకు ఎక్కడో చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా తెలిసిన వారి నుంచే ఈ రకమైన వేధింపులను ఎదుర్కొంటున్నారు.

ఇదిలా ఉంటే ఢిల్లీలో 4 ఏళ్ల విద్యార్థినిపై స్కూల్ ఫ్యూన్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. బుధవారం దక్షిణ రోహిణి పోలీస్ స్టేషన్ వచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. రోహిణిలోని ఓ పాఠశాలలో ప్యూన్‌గా పనిచేస్తున్న 43 ఏళ్ల వ్యక్తిని నాలుగేళ్ల బాలికపై వేధింపులకు పాల్పడినందుకు గురువారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. తన కుమార్తెపై వేధింపులకు పాల్పడినట్లు బాలిక తల్లి ఫిర్యాదు చేసింది.

Read Also: Karnataka Elections: కర్ణాటక ఎన్నికల ఓటింగ్ శాతంలో రికార్డ్..1952 తర్వాత ఇదే తొలిసారి..

వేధింపులకు పాల్పడిన వ్యక్తికి మీసాలు ఉంటాయని కొన్ని గుర్తులను బాలిక పోలీసులకు చెప్పింది. బాలిక మే 1న పాఠశాలలో చేరింది. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గురువారం ఉదయం చిన్నారి చెప్పిన ఆధారాలతో పోలీసులు స్కూల్ లో ప్యూన్ గా పనిచేస్తున్న సుల్తాన్‌పురికి చెందిన సునీల్‌కుమార్‌(43)ని అరెస్ట్ చేశారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 354 బీ, పోక్సో చట్టం సెక్షన్ 10 కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Show comments