NTV Telugu Site icon

Hit and run: మహారాష్ట్రలో మరో హిట్ అండ్ రన్ కేసు.. కారు ఢీకొని యువకుడి మృతి

Hitandruncase

Hitandruncase

మహారాష్ట్రలో పూణె హిట్ అండ్ రన్ ఘటనను మరువక ముందే పాల్ఘర్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో మరో దుర్ఘటన చోటుచేసుకుంది. స్కార్పియో వాహనం అతి వేగంగా దూసుకురావడంతో సాగర్ గజానన్ పాటిల్ అనే 29 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. వాహనాన్ని వదిలి డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు. అయితే పోలీసులు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కారు యాజమానిని వదిలిపెట్టి డ్రైవర్‌ను కేసులో ఇరికిస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Waqf Bill: వక్ఫ్ బిల్లుపై ‘‘జేపీసీ’’ ఏర్పాటు.. డీకే అరుణ, ఓవైసీలకు చోటు..

ముంబైకి 94 కిలోమీటర్ల దూరంలోని పాల్ఘర్‌ సమీపంలో ఉన్న మనోర్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో స్కార్పియో వాహనం వేగంగా దూసుకొచ్చి.. బైక్‌పై వెళ్తున్న సాగర్ అనే యువకుడ్ని ఢీకొట్టారు. సాగర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. అయితే ప్రమాదం తర్వాత డ్రైవర్ సహా మరో ముగ్గురు అక్కడ నుంచి పరారయ్యారు. పోలీసుల కేసు నమోదు చేసి స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే డ్రైవర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 105, హత్యానేరంగా కింద కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆ మధ్య కాలంలో పూణెలో మైనర్లు మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరు టెకీల ప్రాణాలను బలితీసుకున్నారు. నిందితుడికి గంటల వ్యవధిలోనే బెయిల్ రావడంతో ఈ ఘటన దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది.

ఇది కూడా చదవండి: Stock market: మార్కెట్‌లో జోష్.. లాభాల్లో ముగిసిన అన్ని రంగాల సూచీలు

 

Show comments