Site icon NTV Telugu

MP Shocker: నర్సుపై సహోద్యోగి అత్యాచారం.. బెదిరిస్తూ రెండేళ్లుగా అఘాయిత్యం..

Madhya Pradesh

Madhya Pradesh

MP Shocker: మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో దారుణం జరిగింది. 28 ఏళ్ల నర్సుపై సహోద్యోగి గత రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. గ్వాలియర్ ఆస్పత్రిలో పనిచేస్తున్న బాధిత మహిళ దుస్తులు మార్చుకునే గదిలో నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండేళ్లుగా బాధితురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఆమెకు సంబంధించిన వీడియోలను రికార్డ్ చేసి, వాటిని లీక్ చేస్తానని బ్లాక్‌మెయిల్ చేస్తూ రాక్షసకాండను కొనసాగిస్తున్నాడు.

Read Also: Budget 2024: అటల్‌ పింఛన్‌దారులకు శుభవార్త! ఒకేసారి డబుల్ చేసే యోచనలో కేంద్రం

నిత్యం వేధింపులతో విసిగిపోయిన బాధితురాలి మంగళవారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. లైంగికంగా దాడి చేసేందుకు ఆమెతో సన్నిహితంగా ఉన్న వీడియోలు చూపిస్తూ బెదిరించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సంఘటన గ్వాలియర్‌లోని శివపురి లింక్ రోడ్‌లో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. తనతో కలిసి పనిచేసే ఆకాష్ సింగ్ తోమర్‌ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది.

నిందితుడు 2022, ఏప్రిల్‌లో ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ వీడియోలను ఉపయోగించి రెండేళ్ల కాలంగా ఆమెను హింసిస్తూ ఉన్నాడు. ఈ వేధింపులు భరించలేక బాధిత నర్సు తన భర్త వద్దకు వెళ్లి పరిస్థితిని చెప్పింది. ఆమె ఫిర్యాదు మేరకు ఝాన్సీ రోడ్ పోలీసులు తోమర్‌పై అత్యాచారం, బెదిరింపుల కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదైన తర్వాత తోమర్ ఆస్పత్రి నుంచి అదృశ్యమయ్యారు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.

Exit mobile version