NTV Telugu Site icon

Cab Driver Dead: క్యాబ్‌ డ్రైవర్‌ పై దాడి ఘటన.. రూ.2 కోట్లుతో వైద్యం చేయించిన దక్కని ప్రాణం

Cab Driver Dead

Cab Driver Dead

Cab Driver Dead: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఉప్పర్ పల్లిలో దాడి ఘటనలో క్యాబ్ డ్రైవర్ వెంకటేష్ మృతి చెందాడు. అర్ధరాత్రి..కేవలం 200 రూపాయల కోసం మొదలైన చిన్నపాటి గొడవ.. ఆ యువకుడి జీవితం శాశ్వతంగా అంధకారంలో కూరుకుపోయింది. తనపై 20 మంది పాశవికంగా దాడి చేయడంతో రెండేళ్లుగా మంచానపడ్డాడు..నరకం చూశాడు. తల్లిదండ్రుల ఆస్తులు అమ్మి రూ. 2 కోట్లు చికిత్సకు అందించినా ఫలితం లేకపోయింది. ఆదివారం స్వగ్రామంలో వెంకటేష్ మృతి చెందాడు.

Read also: Devara: సాయంత్రం సంచలనం సృష్టించబోతున్న దేవర.. మీరు రెడీనా..?

జూలై 2022 లో 200 రూపాయల‌ కోసం గొడవ చెలరేగింది. ఉప్పర్ పల్లి లోని వివేక్ రెడ్డి తో క్యాబ్ చార్జీ విషయం వివాదం తలెత్తింది. చినికి చినికి గాలివానగా మారి దుమారాన్ని రేపింది. వివేక్ తన స్నేహితులకు ఫొన్ చేసి రప్పించాడు. దాదాపు 20 మంది యువకులు క్రికెట్ బ్యాట్స్, వికేట్స్, హాకీ స్టిక్స్ తో విచక్షణారహితంగా దాడి చేశారు. క్యాబ్ డ్రైవర్ ను వెంబడించి వెంబడించి మరీ వివేక్ రెడ్డి గ్యాంగ్ దాడి చేశారు. దీంతో క్యాబ్ డ్రైవర్ వెంకటేష్ స్పాట్ లోనే కుప్పకూలిపోయాడు. రంగ ప్రవేశం చేసిన రాజేంద్రనగర్ పోలీసులు. క్యాబ్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాత్రంతా పోలీస్ స్టేషన్ లోనే కూర్చోబెట్టారు. దాడికి పాల్పడ్డ వివేక్ రెడ్డి గ్యాంగ్ ను వదిలేసింది. తీవ్ర గాయాల పాలైన క్యాబ్ డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించకుండా పోలీస్ స్టేషన్ లోనే కూర్చొబెట్టారు. ఉదయం అతని పరిస్థితి విషమించడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వెంకటేష్ కోమా లోకి వెళ్లిపోయాడు. క్యాబ్ డ్రైవర్ పై 11 టైగర్స్ దాడి చేసిన కథనాన్ని సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో.. నిందితుల పూర్తి వివరాలను పేర్ల తో సహా బయట పెట్టారు. కొడుకును బతికించుకునేందుకు తల్లిదండ్రులు సుమారు రూ. 2 కోట్లు ఖర్చు చేశారు. ఇందుకోసం ఎకరంన్నర పొలాన్ని విక్రయించారు. ఇంటిని తాకట్టు పెట్టి ఎక్కడికక్కడ అప్పులు చేశారు. రెండు నెలల కిందటే ఇంటికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. వెంకటేష్ గౌడ్ పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం మృతి చెందాడు.
Nagarjuna Sagar: తెరచుకున్న నాగార్జునసాగర్ డ్యాం 6 క్రస్ట్ గేట్లు..