దొంగలు రెచ్చిపోతున్నారు. అదను చూసి, మాటువేసి మాయ చేస్తున్నారు. హైదరాబాద్ లో జరిగిన దారిదోపిడీ పోలీసులకు సవాల్ విసురుతోంది. బహదూర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో 10లక్షల రూపాయల దారి దోపిడీ జరిగింది. పురానాపూల్ రోడ్డులో 10 లక్షల రూపాయలతో వెళుతున్న ఓ వ్యక్తి దృష్టి మరల్చి దోపిడీకి పాల్పడ్డారు ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు.
ఓ బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు వ్యక్తి చేతిలోని 10లక్షల రూపాయల బ్యాగ్ ఎత్తుకెళ్లారు. దీంతో బహదూర్ పుర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు బాధితుడు. కేసు నమోదు చేసిన బహదూర్ పుర పోలీసులు సీసీ కెమేరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడిని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. వ్యక్తి కదలికలను ముందే గమనించిన పోలీసులు ఈ దారుణానికి ఒడిగట్టారు. నగదు తీసుకుని వెళ్లేవారు జాగ్రత్తగా వుండాలని, ఆటోల్లో, రోడ్లపై వెళ్లేటప్పుడు అప్రమత్తత అవసరం అంటున్నారు పోలీసులు.
