షియోమీ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ ..కొత్త ఫీచర్స్ తో మార్కెట్లో దూసుకుపోయే షియోమీ సరికొత్త స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి వదిలింది. షియోమీ 11 Lite NE స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. షియోమీ 11 T, షియోమీ 11 T Pro లతో పాటు ఈ వారం ప్రారంభంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫోన్ రిలీజైంది. MI 11 Lite కు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా ఇది మార్కెట్లోకి వచ్చింది.
ఇక దీని స్పెసిఫికేషన్స్ చూస్తే ..డాల్బీ విజన్ సపోర్ట్, క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్, 5జీ వంటి ఫీచర్లను ఈ లెటెస్ట్ వర్షన్‌లో చూడొచ్చు. ఆండ్రాయిడ్ 11 ఆధారిత MIUI 2.5 ఆపరేటింగ్ సిస్టంపై ఇది పనిచేస్తుంది. 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ 10-బిట్ ఫ్లాట్ ట్రూ కలర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 Hertz. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ కలిగి వుంటుంది.
Also Read
- Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
- ATF Price Hike: విమాన ప్రయాణికులకు షాక్.. జెట్ ఫ్యూయల్ ధరలు పెంపు..
- LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
కెమెరాల విషయానికి వస్తే.. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 5 మెగాపిక్సెల్ టెలిమాక్రో షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 4250 MAHకాగా, 33W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. 5జీ, ఎన్ఎఫ్‌సీ, ఇన్‌ఫ్రారెడ్(ఐఆర్) బ్లాస్టర్ వంటి ఫీచర్లు కూడా షియోమీ అందించింది.
షియోమీ 11 లైట్ 5జీ ఎన్ఈ ధర 27,499 రూపాయలు. అయితే దీపావళి కానుకగా అక్టోబర్ 2 నుంచి 7 వరకు ధరను 1,500 రూపాయలు తగ్గిస్తోంది. అంటే 27,499 రూపాయల ఫోన్ 25,499 రూపాయలకే అందుతుంది. అలాగే దీనికి బ్యాంక్ ఆఫర్ ద్వారా 2 వేల రూపాయల క్యాష్ బ్యాక్ పొందవచ్చు.
యూరోప్‌లో ఈ ఫోన్‌కు సంబంధించిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 349 యూరోలు ..అంటే దాదాపు 30 వేల 200గా నిర్ణయించారు. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 399 యూరోలు.. అంటే సుమారు 34వేల 500 రూపాయలుగా ఉంది.
- Tags
- india
- mi Lite NE
- Smart Phone
- xiaomi
తాజావార్తలు
-
Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
-
Nani: ‘నానిని చూస్తుంటే ఆ స్టార్ హీరో గుర్తొచ్చాడు’.. మోహన్ బాబు
-
KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
-
The Paradise: బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ తొక్కేశా.. ఆ క్యారెక్టర్ అని తెలిస్తే ఒప్పుకునేవాడినే కాదు: మోహన్ బాబు
-
Mohan Babu: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను దారుణంగా మోసం చేశాడు.. నాని ముందే బాంబ్ పేల్చిన మోహన్ బాబు!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?