ప్రపంచ జనాభాలో నాలుగో వంతు భారత్, చైనాల్లోనే నివసిస్తోంది. డ్రాగన్ దేశంలో 60 ఏళ్లలో మొదటిసారి జనాభా వృద్ధిరేటు తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇండియా జనాభా 141.2 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాదిలోనే భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా అవతరిస్తుందన్నది ఐక్యరాజ్యసమితి అంచనా. కాగా.. మన దేశంలో మధ్యతరగతి జనాభా రోజు రోజుకూ పెరుగుతోంది. పీపుల్స్ రీసెర్చ్ ఆన్ ఇండియాస్ కన్స్యూమర్ ఎకానమీ ప్రకారం.. ప్రస్తుతం (2025) దేశ జనాభాలో 40 శాతం మంది మధ్య తరగతిలో ఉన్నారు. 2016లో ఇది 26 శాతంగా ఉండేది.
READ MORE: World’s Most Corrupt Country: ప్రపంచంలో అత్యంత “అవినీతి” దేశం ఇదే.. భారత్ స్థానం ఎంతంటే.?
అయితే.. మధ్యతరగతి వార్షిక ఆదాయం ఎంత? ఈ ప్రశ్న చాలా మందికి వచ్చే ఉంటుంది. వాస్తవానికి భారతదేశంలో మధ్య తరగతి అంటే వార్షిక ఆదాయం రూ. 5లక్షలు- 30 లక్షల వరకు (2020-21 ధరల ఆధారంగా) ఉన్న వారని అర్థం. ఇంత కంటే తక్కువ ఆదాయం ఉన్న వారు దిగువ మధ్యతరగతి కేటగిరీలోకి వస్తారు. ఒక వేళ 30 లక్షల కంటే ఎక్కువగా ఉంటే.. వారు ధనికులని అర్థం.. ఈ అంచనాలకు 2020-21 ధరల ఆధారంగా సూచించారు.
READ MORE: L&T Chairman: సంక్షేమ పథకాల వల్లే కార్మికులు దొరకడం లేదు..
ఇదిలా ఉండగా… ఈ మధ్యతరగతి జనాభా చేతుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉందంటే నమ్ముతారా? అవును ఇది ముమ్మాటికీ నిజం. ఎలాగంటే.. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం డిమాండ్ కొరతను ఎదుర్కొంటోంది. వస్తు, సేవలను ఎక్కువగా వినియోగించే మధ్యతరగతి వారి చేతిలో డబ్బులు లేకపోవడంతో కొనుగోలు శక్తి దెబ్బతింటోంది. దీంతో ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ తగ్గిపోయింది. వినియోగంలో తగ్గడంతో కంపెనీలు ఉత్పత్తిలను పెంచడం లేదు. కొత్త పెట్టుబడులకు ముందుకు రావడం లేదు. ఇది ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి రేటు 6.4 శాతం. గత నాలుగేళ్లలో ఇది అతి తక్కువ వృద్ధి. ఆర్థిక సర్వే 6.3 నుంచి 6.8 శాతం వృద్ధిని అంచనా వేస్తోంది. దీనిని మందగమనానికి సంకేతంగా పరిగణిస్తున్నారు.