IRCTC: వందే భారత్ ఫుడ్ మెనూలో మార్పులు చూశారా.. ఇకపై ఆ 4 ఐటమ్స్ మాత్రమే పెడతారట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IRCTC: ప్రీమియం ప్రయాణానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన వందే భారత్ రైళ్లలో భోజన ప్రియులకు రైల్వే శాఖ పెద్ద షాకిచ్చింది. ఇప్పటి వరకు ప్రయాణికులకు పది రకాల వంటకాలతో విందు భోజనం అందించిన ఐఆర్సిటిసి (IRCTC), ఇప్పుడు ఆ మెనూను పూర్తిగా కుదించేసింది. ఇకపై 8 నుంచి 10 రకాల పదార్థాలకు బదులుగా, కేవలం నాలుగు రకాల వంటకాలను మాత్రమే వడ్డించాలని నిర్ణయించింది.
కొత్త మెనూలో ఉండే ఆ 4 ఐటమ్స్ ఏంటంటే?
మెనూ కుదింపుతో ఒక పూట భోజనం మొత్తం బరువు గతంలో ఉన్న 700–750 గ్రాముల నుంచి ఇప్పుడు 450–500 గ్రాములకు తగ్గిపోయింది. అయితే, వడ్డించే ప్రతి వంటకం పరిమాణంలో మాత్రం ఎలాంటి కోత ఉండదని అధికారులు చెబుతున్నారు. పాత జాబితాలోని చాలా ఐటమ్స్‌ను తీసేసి, కొత్త మెనూను ఇలా మార్చారు. ఉదయం టిఫిన్.. ఇడ్లీ-వడ, పోహా లేదా ఉప్మా (చట్నీ, సాంబార్‌తో కలిపి) మూడింటిలో ఏదో ఒకటి మాత్రమే ఇస్తారు. గతంలో ఇచ్చే సూప్, ఆమ్లెట్, శాండ్విచ్, మజ్జిగ, చాక్లెట్లను పూర్తిగా కట్ చేశారు. ఇకపోతే మధ్యాహ్నం & రాత్రి భోజనంలో చపాతీ, అన్నం, పప్పుతో పాటు ఒక మెయిన్ కర్రీ (వెజ్ లేదా చికెన్) కలిపి మొత్తం 4 ఐటమ్స్ మాత్రమే పెడతారు. ఇన్నాళ్లూ మెనూలో ఉన్న పొడి కూరలు, పెరుగు, సలాడ్లు, ఊరగాయ, స్వీట్లకు గుడ్‌బై చెప్పేశారు.
Also Read
- Flipkart CEO: 11 ఏళ్ల ప్రస్థానానికి తెర.. ఫ్లిప్‌కార్ట్ సీఈఓ రాజీనామా..
- Gold Rate Today: ఊహించని రీతిలో.. భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు.. 22, 24 క్యారెట్స్ రేట్స్ ఇవే!
- Cash vs Credit Cards: భారతదేశంలో తొలిసారి సంచలనం.. ఏటీఎం నగదు కంటే క్రెడిట్ కార్డు ఖర్చులే ఎక్కువ!
- EPFO ఖాతాదారులకు గుడ్ న్యూస్.. PF డబ్బులు విత్‌డ్రా మరింత ఈజీ.. ఇక UPI ద్వారా..!
రకాలు తగ్గించడానికి అసలు కారణమిదే
వందే భారత్ రైళ్లలో ఆహారం నాణ్యత సరిగ్గా ఉండట్లేదని గత కొంతకాలంగా ప్రయాణికుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భోజనం చల్లారిపోవడం, పాడైపోయిన పదార్థాలు రావడం, కొన్ని సందర్భాల్లో ఫుడ్‌లో పురుగులు కనిపించడం లాంటి ఘటనలు కలకలం రేపాయి. రైలులోని ఇరుకైన వంటగదిలో, తక్కువ సిబ్బందితో పది రకాల వంటకాలను వేడిగా, శుభ్రంగా తయారు చేయడం సాధ్యం కావడం లేదని రైల్వే వర్గాలు గుర్తించాయి. అందుకే రకాల సంఖ్యను నాలుగుకు పరిమితం చేసి, వాటినైనా తాజాగా, పరిశుభ్రంగా అందించాలని భావిస్తున్నాయి. అంతేకాకుండా, పాత క్యాటరింగ్ పద్ధతికి బదులుగా ‘క్లౌడ్ కిచెన్’ల ద్వారా భోజనాన్ని తయారు చేయించి ప్రయాణికులకు అందిస్తున్నారు.
ప్రస్తుతం ఈ మూడు రూట్లలోనే!
నవంబర్ 2026 నుంచి ఈ కొత్త ఫుడ్ మెనూను పైలట్ ప్రాజెక్ట్ కింద మూడు వందే భారత్ స్లీపర్ రైళ్లలో పరీక్షిస్తున్నారు. అవి
1. ముంబై – బెంగళూరు
2. హౌరా – కామాఖ్య
3. న్యూఢిల్లీ – వారణాసి జంక్షన్
ఈ మూడు మార్గాల్లో ప్రయాణించే వారి అభిప్రాయాలను సేకరించిన తర్వాతే, దేశవ్యాప్తంగా ఉన్న మిగతా సుదూర రైళ్లలోనూ ఈ నాలుగు ఐటమ్స్ మెనూను అమలు చేయడంపై ఐఆర్సిటిసి తుది నిర్ణయం తీసుకోనుంది.
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 12 Live: రామేశ్వరం శ్రీ రామనాథ స్వామి కల్యాణం..
-
IRCTC: వందే భారత్ ఫుడ్ మెనూలో మార్పులు చూశారా.. ఇకపై ఆ 4 ఐటమ్స్ మాత్రమే పెడతారట!
-
AP BSF Jawan Dies on Indo-Bangladesh Border: స్మగ్లర్ల వేటలో విషాదం.. ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దులో ఏపీ జవాన్ మృతి..
-
Suvendu Adhikari: బీజేపీలో చేరాలని ప్రణబ్ ముఖర్జీనే సలహా ఇచ్చారు..! సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు
-
Nithya Menen: ఆ స్టార్ హీరోయిన్‌కి పెళ్లి చేసుకోవాలని ఉందట!
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!