Site icon NTV Telugu

India Electronics Exports: టారిఫ్ ఎఫెక్ట్‌తో ఎలక్ట్రానిక్స్ రంగానికి భారీ ఊరట..

Ai

Ai

India Electronics Exports: ప్రస్తుతం స్టాక్‌మార్కెట్లు దూసుకెళ్తున్నాయి.. దానికి కారణం అమెరికా నుంచి వచ్చిన కీలక ప్రకటన. ఈ ప్రకటనతో భారత మార్కెట్‌లో మళ్లీ ఆశలు చిగురించాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ రంగంలో పనిచేసే కంపెనీలకు ఇది పెద్ద ఊరటగా భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం భారత్‌పై విధించిన టారిఫ్‌ను తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటివరకు 50 శాతం పెంచుతామన్న టారిఫ్‌లను ఏకంగా 18 శాతానికి కుదించారు. ఈ నిర్ణయం భారత్‌కు మరింత ప్రత్యేకంగా మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా కొన్ని ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌పై తక్కువ టారిఫ్ విధించింది. అంటే ఇకపై భారత్ నుంచి అమెరికాకు వెళ్లే సరుకులపై పన్ను భారం తక్కువగా ఉంటుంది. దీని ప్రభావం నేరుగా ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌పై పడనుంది.

READ MORE: CM Chandrababu: కేబినెట్‌ ప్రారంభానికి ముందే మంత్రులతో విడివిడిగా సీఎం భేటీ..

గత కొన్ని ఏళ్లుగా చైనా తర్వాత ప్రపంచంలోనే పెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా భారత్ మారింది. యాపిల్, సామ్‌సంగ్ వంటి పెద్ద కంపెనీలు తమ స్మార్ట్‌ఫోన్లను భారత్‌లో తయారు చేస్తున్నాయి. అయితే గత సంవత్సరం అమెరికా రిసిప్రోకల్ టారిఫ్ ప్రకటించినప్పుడు ఈ రంగానికి పెద్ద షాక్ తగిలింది. అమెరికాలోనే తయారీ చేయాలంటూ ట్రంప్ అప్పట్లో కంపెనీలపై ఒత్తిడి తెచ్చారు. యాపిల్‌కు కొంత మినహాయింపు ఇచ్చినా, ఆ అనిశ్చితి మార్కెట్‌లో భయం కలిగించింది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. భారత్‌పై టారిఫ్‌ను 18 శాతానికి తగ్గించడం వల్ల ఆ అనిశ్చితి చాలావరకు తొలగిపోయింది. ముఖ్యంగా వియత్నాం కంటే భారత్‌పై తక్కువగా టారిఫ్‌లు విధించడం గమనించాల్సిన విషయం. వియత్నాం సైతం ఒక పెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ దేశం. ఆ దేశంపై యూఎస్ 20 శాతం టారిఫ్ విధించింది. ఇక చైనా నుంచి వచ్చే సరుకులపై అమెరికా 37 శాతం టారిఫ్ విధిస్తోంది. ఈ రెండు దేశాలంకంటే భారత్ పై టారిఫ్‌లు తక్కువగా ఉన్నాయి. దీంతో భారత్‌కు అమెరికా మార్కెట్‌లో స్పష్టమైన లాభం కనిపిస్తోంది.

READ MORE: Dhurandhar 2 : ‘ధురంధర్ 2’ ఓటీటీ డీల్ జియో హాట్‌స్టార్‌కే.. ఆ మార్పు వెనుక అసలు కథేంటి?

ఇది భారత్‌లో వస్తువులను తయారీ చేసి అమెరికాకు ఎగుమతి చేసే కంపెనీలకు పెద్ద ఊరట. ఇప్పటికే భారత్ నుంచి అమెరికాకు పెద్ద ఎత్తున స్మార్ట్‌ఫోన్లు వెళ్తున్నాయి. గత ఏడాది టారిఫ్ విషయంలో అనిశ్చితి ఉన్నప్పటికీ, అక్టోబర్ నెలలో రికార్డు స్థాయిలో ఎగుమతులు జరిగాయి. అక్టోబర్ 2025లో భారత్ నుంచి అమెరికాకు 1.47 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్‌ఫోన్లు ఎగుమతి అయ్యాయి. 2024లో ఇదే సంఖ్య కేవలం 0.46 బిలియన్ డాలర్లే. గతేడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు అమెరికా మార్కెట్‌కు మొత్తం 10.78 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్‌ఫోన్లు వెళ్లాయి. ఇవన్నీ టారిఫ్‌పై స్పష్టత లేని సమయంలోనే సాధ్యమయ్యాయి. ఇప్పుడు టారిఫ్ తగ్గడంతో పరిస్థితి మరింత మెరుగవుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా చూస్తే, ఈ టారిఫ్ తగ్గింపు భారత్‌ను గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ మ్యాప్‌లో మరింత బలంగా నిలబెడుతోంది. తయారీ కంపెనీలకు ధైర్యం పెరుగుతోంది.

Exit mobile version