NTV Telugu Site icon

UPI Lite: పిన్‌, మొబైల్ డేటా లేకున్నా ‘లైట్’ తీసుకోండి. యూపీఐ పేమెంట్ చేసేయండి.

Upi Lite

Upi Lite

UPI Lite: యూపీఐ పేమెంట్లు చెయ్యాలంటే మొబైల్‌లో డేటా ఉండాలి. దీంతోపాటు పిన్‌ కూడా తెలిసుండాలి. కానీ.. ఈ రెండూ లేకపోయినా పేమెంట్‌ చేసేందుకు లేటెస్ట్‌గా ‘యూపీఐ లైట్‌’ సర్వీస్‌ అందుబాటులోకి వచ్చింది. దీన్ని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ రీసెంట్‌గా ప్రారంభించారు. యూపీఐ లైట్‌ ద్వారా గరిష్టంగా 200 రూపాయలు చెల్లించొచ్చు. ముందుగా బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి యూపీఐ లైట్‌ వ్యాలెట్‌లోకి అమౌంట్‌ను డిపాజిట్‌ చేసుకోవాలి. ఈ బ్యాలెన్స్‌ 2 వేల రూపాయలకు మించకూడదు. ఇదొక ఆన్‌డివైజ్‌ వ్యాలెట్‌ కాబట్టి దీని నుంచి పేమెంట్‌ చేసేటప్పుడు ఇంటర్నెట్‌ ఉండాల్సిన పనిలేదు. ఇప్పటికే యూపీఐ పేమెంట్ ట్రాన్సాక్షన్ల సంఖ్య రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. ఇప్పుడు యూపీఐ లైట్ కూడా అందుబాటులోకి రావటంతో ఈ లావాదేవీలు సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టనున్నాయి.

తెలంగాణకు రూ.9494 కోట్లు: కిషన్‌రెడ్డి

తెలంగాణలో గత ఎనిమిదేళ్లలో 12 కొత్త మేజర్‌ రైల్వే ప్రాజెక్టుల కోసం దాదాపు 9494 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. వరంగల్‌లో 400 కోట్ల రూపాయలతో రైల్వే కోచ్‌ యూనిట్‌ని ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోందని చెప్పారు. ఈ ఫెసిలిటీ వల్ల 3 వేల మందికి ఉపాధి దొరుకుతుందని తెలిపారు. రైల్వేలు చేపడుతున్న భద్రతా చర్యలతో ఏటా ప్రమాదాల సంఖ్య తగ్గుతోందని పేర్కొన్నారు.

read also: Behind Story of Big Bazaar’s Downfall: బిగ్ బజార్‌ తెర(మరుగు) వెనక ఏం జరిగింది?

బ్లాక్‌స్టోన్‌కి బైజూస్‌ పేమెంట్‌

ఆకాష్ ఎడ్యుకేషనల్‌ కొనుగోలుకి సంబంధించి బ్లాక్‌స్టోన్‌కి బకాయిపడ్డ 234 మిలియన్‌ డాలర్లను బైజూస్‌ తాజాగా చెల్లించింది. ఆకాష్‌లో బ్లాక్‌స్టోన్‌కి చెందిన 38 శాతం వాటాను బైజూస్‌ గతేడాది ఏప్రిల్‌లో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ డీల్‌ని క్లోజ్‌ చేసే సమయంలో బైజూస్‌ ఆకాష్‌ షేర్‌ హోల్డర్లందరికీ పేమెంట్లు చేసింది. కానీ.. కొన్ని కారణాల వల్ల బ్లాక్‌స్టోన్‌కి నిలిచిపోయిన చెల్లింపులను మొన్న గురువారం చేసింది. ఇండియాలోనే పాపులర్‌ ఎడ్యు-టెక్‌ స్టార్టప్‌ అయిన బైజూస్‌కి నష్టాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పేమెంట్‌ జరగటం గమనించాల్సిన విషయం.

Show comments