గోల్డ్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్. బంగారం ధరలు కొండెక్కాయి. గత వారం షాకిచ్చిన ధరలు.. ఈ వారం మరింతగా గూబ గుయిమనేలా షాకిస్తున్నాయి. సోమవారం రికార్డ్ స్థాయిలోకి బంగారం ధరలు చేరుకున్నాయి.
ఇటీవల తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మరలా వరుసగా షాక్‌లు ఇస్తున్నాయి. గత 5-6 రోజలుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. వరుసగా మూడోరోజు పెరిగాయి. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.440 పెరగగా.. నేడు రూ.1,140 పెరిగింది.