NTV Telugu Site icon

US Economy : ప్రమాదంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ.. 452 కంపెనీలు దివాళా!

America

America

మెరికాలోని తాజా గణాంకాల ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే వారం జరిగే పాలసీ సమావేశంలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉంది. అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, అక్కడ మాంద్యం మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. తాజా నివేదికల ప్రకారం.. గత మూడు నెలల్లో అమెరికాలోని చిన్న కంపెనీల ఆదాయాల్లో 37 శాతం క్షీణత ఉంది. 2010 తర్వాత ఇదే అత్యధికం. 2020లో కరోనా కాలంలో కూడా ఇలా జరగలేదు. అప్పుడు 35 శాతం చిన్న కంపెనీల ఆదాయాల్లో త్రైమాసిక క్షీణత ఉంది.

READ MORE: Apple Smart Phones : యాపిల్ స్మార్ట్ ఫోన్లను ఏ దేశంలో ఎక్కువగా వినియోగిస్తున్నారు?

లేబర్, మెటీరియల్ ఖర్చులు పెరగడం, అమ్మకాలు క్షీణించడం కంపెనీల ఆదాయాలను దెబ్బతీశాయి. ఇటీవల.. చిన్న కంపెనీల అమ్మకాల సామర్థ్యం నాలుగేళ్లలో కనిష్ట స్థాయికి పడిపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో కూరుకుపోవడంతో అమెరికాలోని చిన్న కంపెనీలు ఇబ్బందుల్లో పడుతున్నాయి. అమెరికాలో 3.3 కోట్ల చిన్న కంపెనీలు ఉండగా దేశ ఆర్థిక వ్యవస్థలో 44% వాటాను కలిగి ఉన్నాయి. ఈ కంపెనీల్లో 6.17 కోట్ల మంది పనిచేస్తున్నారు. ఇది మొత్తం ప్రైవేట్ రంగంలో 46.4 శాతం.

READ MORE:Nandigam Suresh: మాజీ ఎంపీకి రెండ్రోజుల పోలీస్‌ కస్టడీ.. ఏ కేసులో అంటే..?

452 కంపెనీలు దివాళా..
అమెరికాలో ఏడాది తొలి ఎనిమిది నెలల్లోనే 452 పెద్ద కంపెనీలు దివాళా తీశాయి. గత 14 ఏళ్లలో ఇది రెండో అత్యధిక సంఖ్య. 2020 సంవత్సరంలో కరోనా మహమ్మారి తాకినప్పుడు.. లాక్‌డౌన్ కారణంగా, సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో అంటే ఆగస్టు వరకు 466 కంపెనీలు దివాళా తీశాయి. ఈ ఏడాది ఆగస్టులో 63 కంపెనీలు దివాళా తీయగా, జూలైలో 49 కంపెనీలు దివాలా తీశాయి.

Show comments