Site icon NTV Telugu

Stock Market: కలిసొచ్చిన ట్రంప్ నిర్ణయం.. భారీ లాభాల్లో సూచీలు

Stockmarktet

Stockmarktet

దేశీయ స్టాక్ మార్కెట్‌‌ భారీ లాభాలతో దూసుకెళ్తోంది. ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు.. గ్రీన్‌లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ మన మార్కెట్‌ మాత్రం కళకళలాడుతోంది. ఇక సుంకాలను 90 రోజులు ట్రంప్ వాయిదా వేయడంతో అమెరికా మార్కెట్‌తో పాటు ఆసియా మార్కెట్లు గురువారం భారీ లాభాలు అర్జించాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 1,144 పాయింట్లు లాభపడి 74, 991 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 373 పాయింట్లు లాభపడి 22, 773 దగ్గర కొనసాగుతోంది.

టీసీఎస్ షేర్లు పతనం కాగా.. ఫార్మా మాత్రం లాభాల్లో దూసుకెళ్తున్నాయి. నిఫ్టీలో సిప్లా, టాటా మోటార్స్, టాటా స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్, హిందాల్కో ప్రధాన లాభాలను ఆర్జిస్తున్నాయి. టీసీఎస్ మరియు యాక్సిస్ బ్యాంక్ నష్టపోయాయి.

ఇది కూడా చదవండి: Hyderabad: నగరంలో మరో హిట్ అండ్ రన్.. బైకును ఢీ కొట్టిన కారు.. యువతి మృతి

Exit mobile version