గురువారం ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానాలు ప్రకటించింది. ఆ సమయంలో స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్పంగా లాభాల్లోకి వెళ్లినట్లే వెళ్లి నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. శుక్రవారం మాత్రం అందుకు భిన్నంగా కొనుగోళ్లు కనిపించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోని సానుకూల సంకేతాలు కలిసి రావడంతో దేశీయ మార్కెట్ శుక్రవారం ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. చివరి దాకా అన్ని రంగాల సూచీలు భారీ లాభాల్లో కొనసాగాయి. సెన్సెక్స్ 819 పాయింట్లు లాభపడి 79, 705 దగ్గర ముగియగా.. నిఫ్టీ 250 పాయింట్లు లాభపడి 24, 367 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ. 83.96 దగ్గర ఫ్లాట్‌గా ముగిసింది.
ఇది కూడా చదవండి: Megaquake: జపాన్ సిద్ధంగా ఉండాలి.. మెగా భూకంపం రాబోతోంది..
నిఫ్టీలో ఐషర్ మోటార్స్, ఒఎన్‌జీసీ, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్ మరియు శ్రీరామ్ ఫైనాన్స్ టాప్ గెయినర్స్‌గా కొనసాగగా… బీపీసీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, దివీస్ ల్యాబ్స్ మరియు సన్ ఫార్మా నష్టపోయాయి.
ఇది కూడా చదవండి: Puja khedkar: పూజా ఫ్యామిలీని వెంటాడుతున్న కష్టాలు.. తాజాగా తండ్రిపై ఎఫ్ఐఆర్