NTV Telugu Site icon

Stock market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

Market

Market

దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు చివరి దాకా గ్రీన్‌లోనే కొనసాగాయి. బ్రాడర్ ఇండెక్స్‌లు రికార్డ్ స్థాయిలో ర్యాలీ చేశాయి. తాజా ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. సెన్సెక్స్ 83 వేల మార్కుకు దగ్గరలో ఉంది. అలాగే నిఫ్టీ కూడా 26 వేల మార్కుకు దగ్గర నిలిచింది. సెన్సె్క్స్ 97 పాయింట్లు లాభపడి 82, 988 దగ్గర ముగియగా.. నిఫ్టీ 27 పాయింట్లు లాభపడి 25, 383 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: Rahul Gandhi: రాహుల్ గాంధీ నాలుక కోసిన వారికి రూ.11 లక్షలు.. సేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..

నిఫ్టీలో ఎన్‌టీపీసీ, జెఎస్‌డబ్ల్యు స్టీల్, హిండాల్కో ఇండస్ట్రీస్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్‌అండ్‌టీ లాభపడగా.. బజాజ్ ఫైనాన్స్, హెచ్‌యుఎల్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ మరియు బ్రిటానియా ఇండస్ట్రీస్ నష్టపోయాయి. సెక్టార్లలో ఎఫ్‌ఎంసిజి మరియు టెలికాం మినహా ఇతర అన్ని రంగాల సూచీలు బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, పవర్, రియాల్టీ, మీడియా, మెటల్ 0.4-1 శాతం లాభంతో గ్రీన్‌లో ముగిశాయి. BSE మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్ నోట్‌తో ముగియడంతో బ్రాడర్ ఇండెక్స్‌లు కూడా రికార్డు స్థాయిలో ర్యాలీ చేశాయి. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం పెరిగింది.

ఇది కూడా చదవండి: Hyderabad: ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..