Stock market: స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

  • స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
  • ఉదయం లాభాల్లో ట్రేడ్ అవ్వగా.. అనంతరం నష్టాల్లోకి
Stock

Stock

దేశీయ స్టాక్ మార్కెట్ స్వల్ప నష్టాల్లో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల వాతావరణంతో మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. మొదట్లో సూచీలు బాగానే ట్రేడ్ అయినా.. అనంతరం నెమ్మదిగా నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 34 పాయింట్లు నష్టపోయి 79, 441 దగ్గర ముగియగా.. నిఫ్టీ 18 పాయింట్లు నష్టపోయి 24, 123 దగ్గర ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83. 50 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: NEET-PG Exam: ఈ నెలలో నీట్-పీజీ ఎగ్జామ్.. పరీక్షకు 2 గంటల ముందే ప్రశ్నాపత్రం..

నిఫ్టీలో ఎల్‌అండ్‌టి, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, టీసీఎస్ లాభపడగా… శ్రీరామ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ నష్టపోయాయి.

ఇది కూడా చదవండి: Team India: జింబాబ్వే టూర్లో మార్పులు.. ఐపీఎల్లో సత్తా చాటిన యంగ్ ప్లేయర్ల కు అవకాశం