NTV Telugu Site icon

Tesla: భారత్‌లో ఫ్యాక్టరీ ఏర్పాటుకు టెస్లా సిద్ధం.. కానీ ఒక కండీషన్..

Tesla

Tesla

Tesla: భారతదేశంలోకి ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం, బిలియన్ ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లా ఎంట్రీ ఇవ్వనుంది. వచ్చే ఏడాది భారత్ లోకి టెస్లా కార్లు రాబోతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటి చర్చలు తుదిదశకు వచ్చాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీంతో పాటు భారత్ లో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. గుజరాత్, మహారాష్ట్ర లేదా తమిళనాడు రాష్ట్రాల్లోని ఏదో ఒక ప్రాంతంలో ప్లాంట్ ఏర్పాటు చేయనుంది.

Read Also: Minister Niranjan Reddy: మజీద్‌ల వద్ద ముస్లిం సోదరులను కలిసిన మంత్రి నిరంజన్ రెడ్డి

అయితే దీనికి ఒక కండీషన్ పెట్టిన్నట్లు ఎకనామిక్ టైమ్స్ శుక్రవారం నివేదించింది. ప్రభుత్వం టెస్లా వాహనాలపై దిగుమతి సుంకాన్ని తొలి రెండేళ్లలో 15 శాతం తగ్గిస్తే.. భారతదేశంలో ఫ్యాక్టరీని నెలకొల్పి 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడానికి టెస్లా సిద్ధంగా ఉందని తెలిపింది. దిగుమతి పన్నులను 15 శాతం కన్నా తక్కువకు తగ్గించడానికి కొత్త ఈవీ పాలసీని కేంద్రం రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పన్నులు 40,000 డాలర్ల కంటే ఎక్కువ ధర ఉన్న కార్లపై 100 శాతం, మిగిలిన వాటిపై 70 శాతంగా ఉంది.

ఎలాన్ మస్క్ టెస్లా కంపెనీ 12,000 వాహనాలకు సుంకాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఆమోదిస్తే.. 500 మిలియన్ డాలర్ల వరకు, 30,000 వాహనాలకు రాయితీ ఇస్తే 2 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు ఎకనామిక్ టైమ్స్ తన నివేదికలో పేర్కొంది. అయితే ఈ ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోందని, తక్కువ సుంకంపై దిగుమతి చేసుకునే వాహనాల సంఖ్యను తగ్గించాలని కోరుతుందని సమాచారం. అయితే దీనిపై ఇటు టెస్లా కానీ, అటు ప్రభుత్వ వర్గాలు కానీ స్పందించలేదు.