NTV Telugu Site icon

Tesla Job Offer: బంపర్ ఆఫర్.. 7గంటల పనికి రూ.28,000!..అర్హతలివే..

Tesla

Tesla

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెస్లా బంపర్ ఆఫర్ ప్రకటించింది. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఈ జాబ్ ఆఫర్ ను తీసుకొచ్చారు. ఈ ఆఫర్ తెలిశాక ఈ ఉద్యోగం కావాలని ఎగబడతారు. రోబోటిక్స్, టెక్నాలజీ ప్రేమికులైతే ఈ ఎగిరి గంతేస్తారు. టెస్లా కంపెనీ తన హ్యూమనాయిడ్ రోబోట్ ఆప్టిమస్‌కు శిక్షణ ఇచ్చే వ్యక్తుల కోసం వెతుకుతోంది. ఈ పని కోసం.. కంపెనీ గంటకు $48 చెల్లిస్తోంది. అంటే సుమారు రూ. 4,000. ఈ అవకాశం వస్తే.. రోజూ రూ.28,000 వరకు సంపాదించవచ్చు.

READ MORE: YS Jagan: మాజీ సీఎం జగన్‌కు రాఖీలు కట్టేందుకు పోటీపడిన మహిళలు

జాబ్ ప్రొఫైల్ అంటే ఏమిటి?
ఈ ప్రత్యేక ఉద్యోగంలో రోజూ 7 గంటలు పనిచేసినందుకు కంపెనీ రూ.28,000 చెల్లిస్తోంది. మీరు చేయాల్సిందల్లా మోషన్-క్యాప్చర్ సూట్, వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్‌ని ధరించి.. రోబోట్‌కు వివిధ పనులను నేర్పించడం. హ్యూమనాయిడ్ రోబోట్ పూర్తిగా మనిషిలాగా పనిచేసేలా దానికి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగం చేయడం ద్వారా మీరు భవిష్యత్తును మార్చగల సాంకేతికత అభివృద్ధిలో భాగం అవుతారు. ఇది మాత్రమే కాదు.. మీరు గంటకు రూ. 4,000 వరకు జీతం పొందుతారు. ఇది ఈ రంగంలో అత్యధికం. టెస్లా తమ ఉద్యోగులకు ఆరోగ్య బీమా, పదవీ విరమణ ప్రణాళిక, అనేక రకాల ప్రయోజనాలను కూడా అందిస్తుంది. విశేషమేమిటంటే.. మీరు మీ సమయానికి అనుగుణంగా వివిధ షిఫ్ట్‌లను కూడా ఎంచుకోవచ్చు.

READ MORE:Imran Khan: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ దరఖాస్తు

ఈ ఉద్యోగానికి అర్హులు ఎవరు ?
ఈ ఉద్యోగానికి అర్హత సాధించాలంటే ఎత్తు 5’7″ నుంచి 5’11″ మధ్య ఉండాలి. గరిష్టంగా 30 పౌండ్ల(13.60776 కిలోగ్రాముల) బరువును ఎత్తగలగాలి. మీకు టెక్నాలజీపై ఆసక్తి ఉండాలి. హెడ్‌సెట్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి. చాలా కాలం పాటు మోషన్-క్యాప్చర్ సూట్‌ను ధరించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన దరఖాస్తు లింక్ టెస్లా కెరీర్ వెబ్‌సైట్‌లో లభిస్తుంది. వెబ్ సైట్ ను సందర్శించి త్వరగా దరఖాస్తు చేసుకోండి.