Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సామాన్యుడి గొంతులో ‘మంట’ పుడుతోంది. దీనికి ప్రధాన కారణం భారీగా పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు. గత కొద్ది రోజులుగా గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడంతో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు నిర్వహించడం యజమానులకు కత్తిమీద సాములా మారింది. ముడి సరుకుల ధరలు, లేబర్ ఖర్చులకు తోడు గ్యాస్ భారం తోడవడంతో, ఆ భారాన్ని హోటల్ యాజమాన్యాలు కస్టమర్ల మీదకు మళ్లించాయి. ఫలితంగా మధ్యతరగతి ప్రజలు బయట తినాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.
హోటల్ మెనూలో మంట..
తెలంగాణలోని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లోని హోటళ్లలో ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఒకప్పుడు రూ. 30 నుంచి రూ. 40 మధ్యలో లభించే ఇడ్లీ ప్లేట్ ఇప్పుడు ఏకంగా రూ. 75 కి చేరింది. ఇక దోశ విషయానికి వస్తే.. నెయ్యి లేదా మసాలా దోశ ధరలు రూ. 80 నుంచి రూ. 100 వరకు పలుకుతున్నాయి.
Also Read
- SBI Big Expansion Plan: SBI కీలక నిర్ణయం.. 12 వేల ఉద్యోగాలు, 200-250 కొత్త బ్రాంచ్‌లు.. పూర్తి వివరాలు
- Subhash Chandra: సుభాష్ చంద్రా చుట్టూ సీబీఐ ఉచ్చు.. రూ.1,322 కోట్ల లోన్ కేసులో ఎఫ్ఐఆర్
- Subhash Chandra: లోన్ మోసం కేసులో షాక్.. జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్రపై సీబీఐ ఎఫ్ఐఆర్.. ఆరోపణలు ఇవే!
- Explained: డేటా సునామీ.. దేశంలో జియో ప్రకంపనలకు పదేళ్లు.. ఈ దశాబ్దంలో ఏం మారింది?
సాధారణ మధ్యతరగతి హోటళ్లలో కూడా ఫుల్ మీల్స్ ధర రూ. 200 కి చేరింది. టీ & కాఫీ విషయానికి వస్తే.. సామాన్యుడికి అందుబాటులో ఉండే టీ ధర కూడా రూ. 15 నుంచి రూ. 20 వరకు పెరిగింది.
ధరల పెరుగుదలకు కారణాలు..
కమర్షియల్ సిలిండర్ ధరలు పెరగడం వల్ల హోటల్ నిర్వహణ వ్యయం 20 శాతం నుంచి 30 శాతం వరకు పెరిగింది. పప్పు దినుసులు, వంట నూనెలు, కూరగాయల ధరలు కూడా భారీగా పెరగడం హోటల్ యజమానులను ఇబ్బందుల్లోకి నెట్టింది. కరెంటు బిల్లులు, షాపుల అద్దెలు , పనివారి జీతాలు పెరగడంతో ధరల పెంపు తప్పనిసరి అని యజమానులు వాదిస్తున్నారు.
ధరల పెరుగుదలపై కస్టమర్లు లబోదిబోమంటున్నారు. ఇంత రేట్లు పెట్టి మేం టిఫిన్స్, భోజనాలు హోటల్స్‌లో తినలేం అంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కుటుంబంతో కలిసి బయటకు వెళ్లి టిఫిన్ చేయాలన్నా వెయ్యి రూపాయలు సరిపోని పరిస్థితి ఉంది. చాలా మంది బ్యాచిలర్స్, విద్యార్థులు మెస్ ధరలు పెరగడంతో ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. అంతే కాకుండా.. కొన్ని హాస్టల్స్ వచ్చే నెల నుంచి రెంట్స్ కూడా పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి గ్యాస్ ధరలను నియంత్రించాలని కోరుతున్నారు. ధరల పెరుగుదల వల్ల సామాన్యుడి నెలవారీ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది, ఇది ఇలాగే కొనసాగితే పేద ప్రజల ఆకలి తీరడం కష్టంగా మారనుంది.
తాజావార్తలు
-
New World Map: ‘తప్పుగా చూపితే అంగీకరించం’.. కొత్త ‘‘వరల్డ్ మ్యాప్’’పై భారత్ ఘాటు స్పష్టీకరణ
-
KCR : అసెంబ్లీలో కేసీఆర్ బిగ్ ప్లాన్.. ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు.!
-
TFPC: హోరాహోరీగా ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికలు.. గెలిచింది ఎవరెవరు అంటే ?
-
Fire Accident: ఆటోనగర్‌లోని హ్యుందాయ్ కార్ల షోరూమ్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు..
-
Vikarabad Land Fraud : 2 ఎకరాలు రాసిస్తే.. మొత్తం భూమినే కొట్టేశాడు.. అల్లుడి మాస్టర్ ప్లాన్
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!