Fire Accident: ఆటోనగర్‌లోని హ్యుందాయ్ కార్ల షోరూమ్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలోని ఆటోనగర్‌లో ఉన్న ప్రముఖ హ్యుందాయ్ కార్ల షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భవనం పైభాగంలో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేగింది. ఎగసిపడుతున్న పొగ, మంటలను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించాయి.
ప్రమాదం జరిగిన సమయంలో ఆదివారం సెలవు దినం కావడంతో షోరూమ్‌లో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణనష్టం తప్పిందని అధికారులు తెలిపారు. ఆకస్మికంగా పిడుగు పడటం వల్లే ఈ అగ్నిప్రమాదం సంభవించి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ఆస్తి నష్టం అంచనాతో పాటు ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై విచారణ జరుపుతున్నారు.
Also Read
- Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్‌లో విభేదాలు.. అక్టోబర్ 11న ఎన్నికలు
- Nursing Home Seized: వారం రోజుల్లో ఇద్దరు మృతి.. తిరువూరు నర్సింగ్ హోమ్ సీజ్..!
- DGP CV Anand: గణేశ్ నిమజ్జనాల్లో తీవ్ర విషాదాలు.. తెలంగాణలో ఎస్సై సహా 13 మంది మృతి..
- Nani The Paradise Box Office: ‘ది ప్యారడైజ్’ రికార్డు.. నాని కెరీర్లో ఫాస్టెస్ట్ రూ.100 కోట్ల సినిమా..!
దంపతుల ఆత్మహత్య..
మరోవైపు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం కొత్తకాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కర్రి దుర్గాలక్ష్మి (43), ఆమె భర్త వెంకట నాగేశ్వరరెడ్డి (53) తమ ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. భారీగా ఉన్న అప్పులు, ఆర్థిక లావాదేవీల చిక్కుల వల్లే వీరు ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఇటీవల ఇదే కొత్తకాలనీలో కొప్పిశెట్టి నాగమల్లేశ్వరి అనే మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా, ఆమె రాసిన సూసైడ్ నోట్లో దుర్గ తనకు 15 లక్షల రూపాయలు ఇవ్వాలని పేర్కొంది. అంతేకాకుండా దుర్గకు మరొక మహిళ నుంచి సుమారు కోటి రూపాయల వరకు రావాల్సి ఉన్నట్లు సమాచారం బయటకు వచ్చింది. ఈ వరుస ఆత్మహత్యల వెనుక ఉన్న భారీ ఆర్థిక లావాదేవీలపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు.
తాజావార్తలు
-
Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్‌లో విభేదాలు.. అక్టోబర్ 11న ఎన్నికలు
-
TRAI Internet TV Rules: TRAI కొత్త రూల్స్.. ఇంటర్నెట్లో ఫ్రీగా టీవీ ఛానెళ్లను చూడటం ఇక కష్టమేనా?
-
Nursing Home Seized: వారం రోజుల్లో ఇద్దరు మృతి.. తిరువూరు నర్సింగ్ హోమ్ సీజ్..!
-
DGP CV Anand: గణేశ్ నిమజ్జనాల్లో తీవ్ర విషాదాలు.. తెలంగాణలో ఎస్సై సహా 13 మంది మృతి..
-
Nani The Paradise Box Office: ‘ది ప్యారడైజ్’ రికార్డు.. నాని కెరీర్లో ఫాస్టెస్ట్ రూ.100 కోట్ల సినిమా..!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?