Tech Layoffs 2026: మీరు ఐటీ ఉద్యోగులా? అయితే ఈ రిపోర్ట్ చదవాల్సిందే.. 5 ఏళ్లలో 10 లక్షల మంది ఇంటికి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tech Layoffs 2026: గ్లోబల్ టెక్ మార్కెట్లో ‘లేఆఫ్స్’ (ఉద్యోగాల తొలగింపు) ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ ఒరాకిల్ (Oracle) ఇటీవల ఏకంగా 25,000 మంది ఉద్యోగులను తొలగించడం సంచలనంగా మారింది. ఇందులో కేవలం భారత్‌లోనే 12,000 మంది బాధితులు ఉండటం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో ‘ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్స్’ విడుదల చేసిన తాజా నివేదిక ఐటీ నిపుణులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
READ ALSO: Strait of Hormuz: ట్రంప్ బెదిరింపులు.. ఇరాన్ దూకుడు.. 24 గంటల్లోపే మళ్లీ హార్మూజ్ మూసివేత
Also Read
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
- Cupid Share: కండోమ్ కంపెనీకి కాసుల వర్షం.. రాబడి ఎంతో తెలుసా!
- Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు... క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
5 ఏళ్లలో 10 లక్షల కొలువులు మాయం..
తాజా నివేదిక ప్రకారం.. 2021 నుంచి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో సుమారు 10 లక్షల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలోనే (Q1) 80,000 మందిని కంపెనీలు ఇంటికి సాగనంపాయి. 2026 చివరి నాటికి ఈ సంఖ్య 3 లక్షలు దాటే అవకాశం ఉందని ఒక అంచనా. ఒరాకిల్ 25,000+ ఉద్యోగుల తొలగించగా, అమెజాన్ దాదాపు 16,000 మందికి ఉద్వాసన పలికింది. ఇక మెటా (ఫేస్బుక్) విషయానికి వస్తే.. ఈ కంపెనీ సుమారు 2,400 మందిని తొలగించింది. ఈ మొత్తం లేఆఫ్స్‌లో 77% (61,000 పైగా ఉద్యోగాలు) అమెరికాలోనే పోయాయి.
భారత్‌లో పరిస్థితి ఏంటంటే..
అమెరికా వెలుపల ఆస్ట్రేలియా (4,450), ఆసియాలో భారత్ (2,000 పైగా) ఉద్యోగాల కోతను ఎదుర్కొన్నాయి. ప్రధానంగా క్లౌడ్ కంప్యూటింగ్, సాఫ్ట్వేర్-యాజ్-ఏ-సర్వీస్ (SAAS) రంగాల్లో 28,000 మంది, ఈ-కామర్స్ రంగంలో 19,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ భారీ లేఆఫ్స్‌కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రధాన కారణమని తెలుస్తోంది. 2026లో జరిగిన లేఆఫ్స్‌లో సగం AI, ఆటోమేషన్ వల్లే జరిగాయని ఈ నివేదిక పేర్కొంది. అయితే కంపెనీలు లాభాల్లో ఉన్నప్పటికీ, భవిష్యత్తులో AIపై పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా ఖర్చులను తగ్గించుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఐటీ నిపుణులు ఏం చేయాలంటే..
పలువురు ప్రముఖ ఐటీ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉద్యోగులు, కంపెనీలు AI ప్రభావాన్ని ముందుగానే గుర్తించడంలో విఫలమయ్యారని అన్నారు. “కేవలం మల్టీ టాస్కింగ్ మాత్రమే సరిపోదు. ఐటీ నిపుణులు అప్‌స్కిల్లింగ్ (కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం) పై దృష్టి పెట్టాలని సూచించారు. కంపెనీకి మీ అవసరం తప్పనిసరి అనిపించేలా మీ ‘వాల్యూ’ పెంచుకోవాలి” అని ఉద్యోగులకు చెప్పారు. మరోవైపు కంపెనీలు భారీ లాభాల్లో ఉండి కూడా ఉద్యోగులను తొలగించడంపై ఉద్యోగ సంఘాలు (NITES వంటివి) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వారు కోరుతున్నారు.
తాజావార్తలు
-
US Open 2026: యూఎస్ ఓపెన్ 2026లో చరిత్రలోనే భారీ ప్రైజ్‌పూల్.. సింగిల్స్ విజేతకు రూ.52.65 కోట్లు
-
SRH Player: 51 బంతుల్లో 111 పరుగులు.. ఓ రేంజ్లో రెచ్చిపోయిన సన్ రైజర్స్ మాజీ ఆటగాడు..
-
Iran Vs America: గేర్ మార్చిన ఇరాన్.. వణికిపోతున్న ట్రంప్.. నెక్ట్స్ జరిగేది ఇదే!
-
Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
-
America Debt:ఇంకెక్కడ సూపర్ పవర్..? అగ్రరాజ్యం నెత్తిన అప్పుల కుప్ప ఎంత ఉందంటే?
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!