TCS: లేఆఫ్స్ మధ్య TCS కొత్త పే పాలసీ.. ఉద్యోగుల్లో భయం
- వరస లేఆఫ్స్ మధ్య టీసీఎస్ కొత్త సాలరీ పాలసీ..
- ఆఫీస్ హాజరుతో లింక్ చేయడంతో ఉద్యోగుల్లో అసంతృప్తి..
- జీతాలపై ప్రభావం పడుతుందనే ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TCS: వరస లేఆఫ్స్ తో టెక్ రంగంలో అనిశ్చితి నెలకొంది. ప్రస్తుతం దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) నిర్ణయం ఉద్యోగుల్లో ఆందోళన పెంచుతోంది. వేరియబెల్ పే విధానాన్ని మార్చి, ఆఫీస్ హాజరుతో లింక్ చేయడంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. 6 లక్షల మంది ఉద్యోగులపై ఇది ప్రభావం చూపుతోంది. ఇప్పటి వరకు వేరియబుల్ పే రూపంలో నెలవారీగా లేదా క్వార్టర్లీ వారీగా అందుతున్న మొత్తాన్ని ఇప్పటి నుంచి ‘‘మంత్లీ పర్ఫామెన్స్ పే’’గా మార్చారు. దీంతో ఉద్యోగులు ఆఫీస్ హాజరు, ప్రాజెక్ట్ డిప్లాయ్‌మెంట్ ఆధారంగా నిర్ణయించనున్నారు. దీని కారణంగా ఆఫీస్ తక్కువగా వచ్చే ఉద్యోగులకు టేక్-హోమ్ సాలరీ తగ్గే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
మరోవైపు, ఈ ఏడాది టీసీస్ సాధారణంగా 5 శాతం నుంచి 8 శాతం వరకు జీతాలను పెంచినట్లు సమాచారం. మంచి పనితీరు కనబరిచిన ఉద్యోగులకు A+ కేటగిరీలో చేర్చి, 10 శాతం నుంచి 13 శాతం వరకు పెంచినట్లు తెలుస్తోంది. తక్కువ రేటింగ్ పొందిన వారికి కేవలం 2 శాతం నుంచి 3 శాతం వరకు మాత్రమే పెరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు, దేశంలో కొత్త లేబర్ కోడ్స్‌కు అనుగుణంగా కంపెనీ వేతన నిర్మాణాన్ని అమలు చేస్తున్నట్లు టీసీఎస్ చెబుతోంది.
Also Read
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
కొంత మంది ఉద్యోగులకు నెలవారీ వేరియబుల్ పే తగ్గినట్లు తెలుస్తోంది. కొందరికి త్రైమాసిక లేదా వార్షిక జీతం మారింది. గ్రుచ్యుటీ కూడా సీటీసీలో కనిపించడం లేదని మరికొందరు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, కొత్త విధానంలో వేరియబుల్ పేను రెండు భాగాలుగా విభజించినట్లు సమాచారం. మంత్లీ పర్ఫామెన్స్ పే, పర్ఫామెన్స్ బోనస్ రూపంలో క్వార్టర్లీకి బదులుగా వార్షికంగా చెల్లించే అవకాశం ఉందని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ రెండు అంశాల్లో కోత పడితే టేక్ హోం సాలరీ తగ్గుతుంది. మరోవైపు, మేనేజర్లు ఎక్కువ మంది ఉద్యోగుల్ని తక్కువ పనితీరు కేటగిరి ‘‘Band D’’లో ఉంచినట్లు తెలుస్తోంది. ఈ కేటగిరీలో ఉన్న ఉద్యోగుల జీతాలు, ఉద్యోగ భద్రతపై ప్రభావం ఉండొచ్చని భయం మొదలైంది.
తాజావార్తలు
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..