స్వల్ప లాభాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం అయ్యాయి.సెన్సెక్స్ 142 పాయింట్లు లాభంతో 55, 708 పాయింట్ల వద్ద, నిఫ్టి 43 పాయింట్లు లాభంతో 16,627 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.77.57 వద్ద కొనసాగుతోంది. ఏషియన్ పెయింట్స్, హెచ్ యూఎల్, ఎన్టీపీసీ, టైటన్, ఐటీసీ, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, మారుతీ, ఇండస్ ఇండ్ యాక్సిస్ బ్యాంకు షేర్లు లాభాల్లో వున్నాయి.
డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, పవర్ గ్రీడ్, అల్ట్రా టెక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు కనిపించాయి. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం భయాలు అన్నిదేశాలను వెంటాడుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం ఫార్మా రంగంపై అంతగా పడలేదని నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఊరట కలిగింది. వాణిజ్య సిలిండర్ ధరను భారీగా తగ్గించింది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ఒక్కోదానిపై రూ.135 తగ్గిస్తున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ప్రస్తుతం ఢిల్లీలో 19కిలోల సిలిండర్ ధర రూ.2219, కోల్కతాలో రూ.2322, ముంబయిలో రూ.2171.50, చెన్నైలో రూ.2373గా ఉంది. బుధవారం నుంచే కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. మరోవైపు.. డొమెస్టిక్ ఎల్పీజీ ధరల్లో ఎలాంటి మార్పు జరగలేదు.
