రుతుపవనాల రాకతో స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ పెరిగింది. అయితే నిన్న లాభాలతో ప్రారంభమయిన దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభం అయ్యాయి. గత రెండు రోజుల భారీ లాభాలకు చెక్‌పెడుతూ సెన్సెక్స్ 500 పాయింట్లు, నిఫ్టీ 100 పాయింట్లు నష్టపోయింది. ముడి చమురు ధరల పెంపు,అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో ఈ నష్టాలు కొనసాగుతున్నాయి.
సెన్సెక్స్ (-477) 55448 వద్ద, నిఫ్టీ (-119) 16542 వద్ద కొనసాగుతున్నాయి. ఆటో, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ షేర్లు లాభపడగా. మరోవైపు ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్‌ఎంసీజీ షేర్లు నష్టాల్లో వున్నాయి. లాభాలు క్షీణించడంతో ఎల్‌ఐసీ షేర్లు 2శాతం నష్టపోతున్నాయి. సన్ ఫార్మా, హెచ్‌డిఎఫ్‌సి, ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ టెక్, టైటన్, కోటక్ బ్యాంక్, విప్రో, టీసీఎస్ టెక్ మహీంద్రా 1-2 శాతం పతనం అయ్యాయి.
పవర్‌గ్రిడ్, ఎంఅండ్‌ఎం, టాటా స్టీల్, ఎన్‌టీపీసీ మాత్రమే లాభాల్లో కొనసాగుతున్నాయి. స్టాక్ మార్కెట్ వర్గాల సంపద మూడు రోజుల్లో రూ.10.19 లక్షల కోట్లు పెరిగి రూ.258.47 లక్షల కోట్లకు చేరుకుంది. డాలర్‌తో రూపాయి మారకం రేటు 4 పైసలు బలపడి రూ.77.54 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ రేటు ఒక దశలో 0.43 శాతం పెరుగుదలతో 119.9 డాలర్ల వద్ద ట్రేడైంది. బంగారం, వెండి ధరలు కాస్త తగ్గాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 గ్రాముల పసిడి ధర రూ. 52,700గా ఉంది. కిలో వెండి ధర రూ. 63,080గా ఉంది.
