దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాలతోనే ముగిశాయి. సెన్సెక్స్ 934 పాయింట్ల లాభంతో 52,532 వద్ద ముగియగా.. నిఫ్టీ 288 పాయింట్ల లాభంతో 15,638 వద్ద స్థిరపడింది. మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే ధోరణిని
ప్రదర్శించాయి. సెన్సెక్స్ 30 సూచీలో ఒక్క నెస్లే ఇండియా మాత్రమే నష్టాలను చవిచూసింది. మిగతా కంపెనీల షేర్లు లాభాలను
గడించాయి.
అత్యధికంగా లాభాలను గడించిన కంపెనీలలో టెక్ దిగ్గజాల షేర్లు ఉన్నాయి. విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహింద్రా, టీసీఎస్, హెచ్‌సీఎల్ వంటి
కంపెనీ షేర్లు లాభపడిన కంపెనీల జాబితాలలో ఉన్నాయి. అటు టైటాన్, ఎస్‌బీఐ, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్, ఐటీసీ, ఎన్‌టీపీసీ, ఎల్ అండ్
టీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఆల్ట్రాటెక్ సిమెంట్స్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు కూడా లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో
చమురు ధరలు తగ్గడం మార్కెట్లకు కలిసొచ్చిందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.78.06గా ట్రేడ్ అవుతోంది.
SBI Annuity Scheme : అదిరిందిగా.. ఎస్బీఐ నుంచి నెలవారి ఆదాయం..
