NTV Telugu Site icon

Stock Markets: కంపెనీల ఫలితాల నేపథ్యంలో లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్..

Stock Market

Stock Market

నేడు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వచ్చినప్పటికీ రికార్డు స్థాయిలో జీఎస్టీ రాబడి, అనేక కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఇండెక్స్‌ ను లాభాల వైపుకు తీసుకెళ్లాయి. అంతర్జాతీయ మార్కెట్‌ లో ముడి చమురు ధర తగ్గడం కూడా ఇందుకు ఒక కారణం. ఆటో స్టాక్స్, మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ స్టాక్స్ మంచి పనితీరు కనబరిచాయి. ఇక మరోవైపు బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొవడంతో నష్టాలలో ట్రేడ్ అయ్యాయి. ఇది ఇండెక్స్‌ ను చిన్న లాభాలకు మాత్రమే పరిమితం చేసాయి.

Also read: WhatsApp Update: జిమెయిల్ తో పనిలేకుండా సరికొత్త కొత్త ఫీచర్ ను అందించనున్న వాట్సాప్‌..

ఉదయం సెన్సెక్స్ 74,391.73 పాయింట్లతో స్వల్ప నష్టలతో ప్రారంభమైంది. ఆ తర్వాత కోలుకున్న.. హెచ్చు తగ్గుల మధ్య, మార్కెట్ సమయం ముగిసే సరికి లాభాల్లో ఉన్నాయి. సూచీ రోజువారీ గరిష్ట స్థాయి 74812.43 పాయింట్లకు చేరుకుంది, అయితే చివరకు 128.33 పాయింట్ల పెరుగుదలతో 74611.11 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 37.80 పాయింట్లు పెరిగి 22,642.65 వద్దకు చేరుకుంది. ఇక డాలర్‌ తో రూపాయి మారకం విలువ 83.46 వద్ద ఉంది. సెన్సెక్స్‌ లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (3.91%), ఏసియన్ పెయింట్స్ (3.36%), టాటా మోటార్స్ (1.99%), ఎన్టీపీసీ (1.72%), టాటా స్టీల్ (1.45%).
షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇక నష్టపోయిన వాటిలో కోటక్ బ్యాంక్ (-2.95%), యాక్సిస్ బ్యాంక్ (-1.41%), భారతి ఎయిర్ టెల్ (-1.26%), విప్రో (-1.09%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.05%) లు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర 84.21 డాలర్స్ వద్ద కొనసాగుతోంది.

Also read: Snake In Car: వామ్మో.. రోడ్డు పై వేగంగా వెళ్తున్న కారు.. కాకపోతే కారు కింద చూస్తే.. షాకింగ్ వీడియో..

ఇక నేడు ప్రైవేట్ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు దారుణంగా పడిపోయాయి. జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ కెవిఎస్ మన్నియన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేసినట్లు బ్యాంక్ ప్రకటించింది. శ్రీ మణియన్ దాదాపు మూడు దశాబ్దాలుగా కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో పని చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఆన్‌లైన్ ఛానెల్‌ల ద్వారా కొత్త కస్టమర్లు, క్రెడిట్ కార్డుల జారీపై ఆర్‌బీఐ ఇప్పటికే ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీని ఫలితంగా, కోటక్ షేర్లు తాత్కాలికంగా 4% పడిపోయి 52 వారాల కనిష్టానికి చేరాయి. బిఎస్ఈ లో చివరకు 2.78 % పతనమై 1,578.65 వద్ద ముగిసింది.

Show comments