Stock Market: ట్రంప్ బెదిరింపుల వేళ భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

  • ట్రంప్ బెదిరింపుల వేళ వరుస లాభాలు
  • మంగళవారం కూడా భారీ లాభాల్లో ముగిసిన సూచీలు
  • మధ్యాహ్నం నుంచి పుంజుకున్న మార్కెట్
Stockmarket

Stockmarket

దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం కూడా అనూహ్యంగా పుంజుకుంది. నష్టాలతో ప్రారంభమై లాభాలతో ముగిసింది. సోమవారం కూడా నష్టాల్లో ట్రేడ్ అయిన సూచీలు.. మధ్యాహ్నం నుంచి హఠాత్తుగా ఊపందుకున్నాయి. చివరికి భారీ లాభాల్లో ముగియడంతో ఇన్వెస్టర్ల పంట పండింది. ఈరోజు కూడా అదే పరిస్థితి ఏర్పడింది. ట్రంప్ బెదిరింపులు కారణంగా మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. మధ్యాహ్నం నుంచి పుంజుకున్నాయి. ముగింపులో భారీ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 509 పాయింట్లు లాభపడి 74, 616 దగ్గర ముగియగా.. నిఫ్టీ 155 పాయింట్లు లాభపడి 23, 123 దగ్గర ముగిసింది. ఐటీ, మెటల్, రియల్టీ రంగాలు బాగా రాణించాయి. ఇక రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే మంగళవారం 93 దగ్గర స్వల్ప లాభాలతో ముగిసింది.

ఇది కూడా చదవండి: Iran-Israel War: రైల్లో ప్రయాణం చేయొద్దు.. ఇరానీయులకు ఇజ్రాయెల్ హెచ్చరిక

నిఫ్టీలో విప్రో, హిండాల్కో ఇండస్ట్రీస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టిసిఎస్, ఇన్ఫోసిస్ షేర్లు అత్యధికంగా లాభపడగా.. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, అపోలో హాస్పిటల్స్, అదానీ పోర్ట్స్ షేర్లు నష్టపోయాయి. కన్స్యూమర్ డ్యూరబుల్స్, పీఎస్‌యూ బ్యాంక్ మినహా.. మిగతా అన్ని రంగాల సూచీలు లాభాలతో ముగిశాయి.