Stock Market: హమ్మయ్య మార్కెట్ తెప్పరిల్లింది.. లాభాల్లో సూచీలు

  • కోలుకున్న స్టాక్ మార్కెట్
  • నష్టాలతో ప్రారంభమై లాభాల్లోకి
  • నిన్న భారీ నష్టాలను చవిచూసిన మార్కెట్
Stockmarket

Stockmarket

దేశీయ స్టాక్ మార్కెట్ కోలుకుంటోంది. బడ్జెట్ రోజున భారీ నష్టాలను చవిచూసిన మార్కెట్.. సోమవారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైంది. ఈరోజు కూడా నష్టాలే ఉంటాయనుకుంటున్న తరుణంలో కొద్దిసేపటికే లాభాల్లోకి వచ్చింది. ప్రస్తుతం సెన్సెక్స్ 312 పాయింట్లు లాభపడి 81,035 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 60 పాయింట్లు లాభపడి 24,886 దగ్గర కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: Case Filed Against Jogi Ramesh: జోగి రమేష్‌పై కేసు నమోదు.. అజ్ఞాతంలోకి మాజీ మంత్రి..!

నిఫ్టీలో ఎల్ అండ్ టీ, భారత్ ఎలక్ట్రానిక్స్, ఆసియన్ పెయింట్స్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, అదానీ పోర్ట్స్ ప్రధాన లాభాలను ఆర్జించగా.. శ్రీరామ్ ఫైనాన్స్, ఐటీసీ, ఎన్‌టీపీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్, మాక్స్ హెల్త్‌కేర్ నష్టపోయాయి. ఆటో, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, ఫార్మా, పీఎస్‌యు బ్యాంక్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Nagarajuna Akkineni : నాగ్ కోసం కథ రెడీ చేస్తున్న హిట్ దర్శకుడు

నిర్మలమ్మ బడ్జెట్‌లో సామాన్యుడికి ఊరట కలిగించేలా పన్ను శ్లాబ్‌ల్లో ఎలాంటి మార్పులు జరగలేదు. అలాగే ఇన్వెస్టర్లకు కూడా పద్దు రుచించలేదు. దీంతో నిన్న మార్కెట్ భారీ నష్టాలను చవిచూసింది. దాదాపు రూ.8లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది.