Stock Market: స్టాక్ మార్కెట్‌కు జోష్.. భారీ లాభాల్లో సూచీలు

  • స్టాక్ మార్కెట్‌కు జోష్
  • కలిసొచ్చిన ట్రంప్ ప్రకటన
  • భారీ లాభాల్లో సూచీలు
Stockmarket

Stockmarket

దేశీయ స్టాక్ మార్కెట్‌కు శుక్రవారం మంచి జోష్ కనిపిస్తోంది. గురువారం భారీ నష్టాలను చవిచూసిన మార్కెట్.. శుక్రవారం మాత్రం లాభాలతో ప్రారంభమైంది. నిన్న దాదాపు రూ.8లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ఆ నష్టాన్ని ఈరోజు ఇన్వెస్టర్లు పూడ్చుకుంటున్నారు. ప్రస్తుతం అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 361 పాయింట్లు లాభపడి 82,859 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 127 పాయింట్లు లాభపడి 25,581 దగ్గర కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: Gold Rates: మగువలకు గుడ్‌న్యూస్.. తగ్గిన వెండి, బంగారం ధరలు

నిఫ్టీలో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్ ప్రధాన నష్టాలను చవిచూడగా.. కోల్ ఇండియా, ఒఎన్‌జీసీ, ఎల్ అండ్ టీ, ఐషర్ మోటార్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ లాభపడ్డాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Trump: బోర్డ్ ఆఫ్ పీస్ మీటింగ్‌లో పాక్ ప్రధానికి అవమానం.. ట్రంప్ ఏం చేశారంటే..!

నిన్న ఇరాన్-అమెరికా యుద్ధ భయాలు కారణంగా భారీ నష్టాలను చూసింది. ప్రస్తుతం ప్రపంచం వ్యాప్తంగా సానుకూల సంకేతాలు ఉండడంతో మార్కెట్‌కు కలిసొచ్చింది. అణు ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్‌కు ట్రంప్ 10 రోజులు గడువు ఇచ్చారు. ఇది మార్కెట్‌కు ఉపశమనం కలిగింది.