దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలతో వారాంతంలో స్టాక్‌మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ 1,016 పాయింట్ల భారీ నష్టంతో 54,303 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 276 పాయింట్ల నష్టంతో 16,201 వద్ద స్థిరపడింది. అమెరికా ద్రవ్యోల్బణం గణాంకాలు రావడం, అంతర్జాతీయ సానుకూల సంకేతాలు లేకపోవడంతో ఉదయం నుంచే సూచీలు డీలాపడ్డాయి. దీంతో మదుపర్లు తమ షేర్లను అమ్మేందుకు సిద్ధపడ్డారు.
Face Book: ఫేస్‌బుక్‌లో కీలక మార్పులు.. మారనున్న టికర్, లోగో
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో దాదాపు 50 కంపెనీలు ఉండగా 37 కంపెనీలు నష్టపోయాయి. ఏషియన్ పెయింట్స్, గ్రాసిమ్, అల్ట్రాటెక్ సిమెంట్, దివిస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్ వంటి కంపెనీ షేర్లు మాత్రమే లాభాలను చవిచూశాయి. బజాజ్ ఫైనాన్స్, కొటక్ మహీంద్ర, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, విప్రో, రిలయన్స్, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్, టీసీఎస్, హెచ్‌సీఎల్ వంటి కంపెనీల షేర్లు నష్టాల్లో ముగిశాయి.
