Site icon NTV Telugu

Stock Market: స్టాక్ మార్కెట్ ఢమాల్.. భారీ నష్టాల్లో సూచీలు

Stockmarket

Stockmarket

దేశీయ స్టాక్ మార్కెట్ అల్లకల్లోలంగా మారింది. గత మూడు రోజులుగా ఐటీ పతనంతో లక్షల కోట్ల సంపద ఆవిరైపోతుంది. శుక్రవారం కూడా అదే పరిస్థితి దాపురించింది. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు, ఇంకోవైపు ఏఐ భయాలతో మార్కెట్ అతలాకుతలం అయింది. శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్.. భారీ నష్టాల్లోకి జారుకుంది.

వ్యాపార నమూనాకు AI-ఆధారిత ఆటోమేషన్ అంతరాయం కలిగిస్తుందనే భయాలు తీవ్రతరం కావడంతో ఫిబ్రవరి 13న ఐటీ ఇండెక్స్ వరుసగా మూడవ సెషన్‌లో 5 శాతం క్షీణించింది. ఫిబ్రవరి 12న సెక్టోరల్ ఇండెక్స్ 5.5 శాతం క్షీణించింది. ఇప్పటికే పెట్టుబడిదారుల లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది.

ఇది కూడా చదవండి: PM Modi: ఈ ఫలితం బంగ్లాదేశ్ ప్రజల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది.. తారిక్ రెహమాన్‌కు మోడీ అభినందనలు

ప్రస్తుతం సెన్సెక్స్ 857 పాయింట్లు నష్టపోయి 82, 817 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 276 పాయింట్లు నష్టపోయి 25,530 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీలో ఇన్ఫోసిస్ , హిందాల్కో ఇండస్ట్రీస్, ఎటర్నల్ 4 శాతం వరకు క్షీణించి.. బజాజ్ ఫైనాన్స్, అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ 1 శాతం వరకు లాభపడ్డాయి.

16 ప్రధాన రంగాలన్నీ క్షీణించాయి. మెటల్ ఇండెక్స్ 3 శాతం పడిపోయింది, త్రైమాసిక లాభంలో 45 శాతం తగ్గుదల నమోదు చేసిన హిండాల్కో 6 శాతం పడిపోయింది. అమ్మకాలు విస్తృత మార్కెట్లకు కూడా విస్తరించాయి, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 వరుసగా 2 శాతం మరియు 1.8 శాతం పడిపోయాయి.

Exit mobile version