దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం నష్టాలతో ముగిసింది. అంతర్జాతీయంగా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. ఆ ప్రభావం మన మార్కెట్‌పై కూడా పడింది. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు.. కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. చివరిదాకా రెడ్‌లోనే ట్రేడ్ అయ్యాయి. ఇక ముగింపులో సెన్సెక్స్ 55 పాయింట్లు నష్టపోయి 79, 486 దగ్గర ముగియగా.. నిఫ్టీ 51 పాయింట్లు నష్టపోయి 24, 148 దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: Nithin Chauhan: ప్రముఖ నటుడు ఆత్మహత్య?
నిఫ్టీలో ఎం అండ్ ఎం, టైటాన్ కంపెనీ, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, నెస్లే లాభాల్లో కొనసాగగా… కోల్ ఇండియా, టాటా స్టీల్, ట్రెంట్, ఏషియన్ పెయింట్స్, శ్రీరామ్ ఫైనాన్స్ నష్టపోయాయి. రంగాల్లో ఐటీ ఇండెక్స్ 0.5 శాతం, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, రియల్టీ 1-2 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.3 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.6 శాతం క్షీణించాయి.
ఇది కూడా చదవండి: Tailors: మహిళల కొలతలు మగవారు తీసుకోవద్దు.. మహిళా కమిషన్ ప్రతిపాదన!