NTV Telugu Site icon

Stock Market: ట్రంప్ జోష్ ఒక్కరోజులోనే ఆవిరి.. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

Stockmarket

Stockmarket

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్ని్కయ్యాక ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లకు మంచి జోష్ వచ్చింది. పసిడి, చమురు ధరలు దిగొస్తున్నాయి. అంతేకాకుండా ఇన్వెస్టర్లలో కూడా కొత్త ఉత్సాహం వచ్చింది. దీంతో బుధవారం మన మార్కెట్ భారీ లాభాలతో దూసుకెళ్లింది. మార్కెట్లు మళ్లీ పుంజుకుంటాయని ఆర్థిక నిపుణులు కూడా విశ్లేషించారు. కానీ అదంతా వట్టిదేనని తేలిపోయింది. కొన్ని గంటల్లోనే సూచీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. గురువారం ప్రారంభంలో నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. చివరిదాకా అలాగే ట్రేడై ముగిశాయి. సెన్సెక్స్ 836 పాయింట్లు నష్టపోయి 79, 541 దగ్గర ముగియగా.. నిఫ్టీ 284 పాయింట్లు నష్టపోయి 24, 199 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.84.37 దగ్గర తాజా రికార్డుతో ముగిసింది.

ఇది కూడా చదవండి: Australia: ఆస్ట్రేలియా కీలక నిర్ణయం.. 16ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం!

నిఫ్టీలో హిందాల్కో ఇండస్ట్రీస్, ట్రెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ భారీగా నష్టపోగా.. అపోలో హాస్పిటల్స్, హెచ్‌డిఎఫ్‌సీ లైఫ్, ఎస్‌బీఐ, టిసీఎస్, ఎల్ అండ్ టీ లాభపడ్డాయి. ఆటో, మెటల్, పవర్, టెలికాం, ఫార్మా, రియాల్టీ 1-2 శాతం క్షీణించడంతో అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 0.5 శాతం చొప్పున క్షీణించాయి.

ఇది కూడా చదవండి: Airport Jobs 2024: 10వ తరగతి ఉత్తీర్ణతతో ఎయిర్‌పోర్ట్ ఉద్యోగాలు.. జీతం ఎంతో తెలుసా?