NTV Telugu Site icon

Stock market: మార్కెట్‌లో ఒడుదుడుకులు.. నష్టాల్లో ముగిసిన సూచీలు

Stockmarket

Stockmarket

దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఒడుదుడుకులు కొనసాగుతున్నాయి. వరుసగా మూడో రోజు కూడా సూచీలు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోని మిశ్రమ సంకేతాలు కారణంగా మన మార్కెట్‌ ఇబ్బందులకు గురవుతోంది. గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఇక ముగింపులో సెన్సె్క్స్ 494 పాయింట్లు నష్టపోయి 81, 006 దగ్గర ముగియగా.. నిఫ్టీ 221 పాయింట్లు నష్టపోయి 24,749 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.83. 99 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: Akhil Akkineni: సరికొత్త ‘అయ్యగారు’ లోడింగ్!

ఇక నిఫ్టీలో బజాజ్ ఆటో, శ్రీరామ్ ఫైనాన్స్, హీరో మోటోకార్ప్, నెస్లే, ఎం అండ్ ఎం నష్టపోగా.. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, పవర్ గ్రిడ్ కార్ప్, ఎస్‌బీఐ లాభపడ్డాయి. సెక్టార్లలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్ (1 శాతం పెరిగింది), ఆటో, మీడియా మరియు రియల్టీ 2-3 శాతం క్షీణించడంతో ఇతర అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ మరియు స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతానికి పైగా నష్టపోయాయి.

ఇది కూడా చదవండి: Unstoppable 4 : బాలయ్య విత్ సీఎం అండ్ డిప్యూటీ.. రికార్డులూ ఊపిరి పీల్చుకోండి