NTV Telugu Site icon

Stock Market: ట్రంప్ ఎఫెక్ట్.. భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

Stockmarlet

Stockmarlet

దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారమంతా భారీ నష్టాలను చవిచూసింది. లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు.. దానికి తోడుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన మార్కెట్‌ను తీవ్రంగా దెబ్బకొట్టింది. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించారు. తాజాగా ప్రధాని మోడీ పర్యటన తర్వాత కూడా ట్రంప్‌ ఆలోచనలో మార్పు కనిపించలేదు. టారిఫ్‌లు తగ్గించే ప్రసక్తేలేదని ట్రంప్ తేల్చిచెప్పారు. దీంతో శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. చివరి దాకా సూచీలు రెడ్‌లోనే కొనసాగాయి. ఇక ముగింపులో సెన్సెక్స్ 199 పాయింట్లు నష్టపోయి 75, 939 దగ్గర ముగియగా.. నిఫ్టీ 102 పాయింట్లు నష్టపోయి 22, 929 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే 86.83 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: kishan reddy: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే.. కాంగ్రెస్ అరాచకాలను ఎండగడతాం

నిఫ్టీలో భారత్ ఎలక్ట్రానిక్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, ట్రెంట్ అత్యధికంగా నష్టపోగా… బ్రిటానియా ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్, టీసీఎస్ లాభపడ్డాయి. మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2 శాతానికి పైగా క్షీణించగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3 శాతానికి పైగా క్షీణించింది. మీడియా, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా, పీఎస్‌యు బ్యాంక్, రియాల్టీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఎనర్జీ 1-3 శాతం క్షీణించడంతో అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి.

ఇది కూడా చదవండి: Pankaj Tripathi : అందుకే బాలీవుడ్ విఫలం అవుతుంది..‘మీర్జాపూర్‌’ నటుడు సంచలన వ్యాఖ్యలు