NTV Telugu Site icon

Stock Market: రుచించిన ఆర్థిక సర్వే.. భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

Stockmarket

Stockmarket

దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ముగిసింది. పార్లమెంట్‌లో కేంద్రం ఆర్థిక సర్వే ప్రవేశపెట్టింది. అలాగే మరోవైపు అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉండడంతో శుక్రవారం ఉదయం నుంచి సూచీలు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. అలాగే నిర్మలమ్మ బడ్జెట్‌పై కూడా ఇన్వెస్టర్ల ఆసక్తి చూపించడంతో చివరిదాకా సూచీలు గ్రీన్‌లో కొనసాగాయి. ఇక ముగింపులో సెన్సెక్స్ 740 పాయింట్లు లాభపడి 77, 500 దగ్గర ముగియగా.. నిఫ్టీ 258 పాయింట్లు లాభపడి 23, 508 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: Sonia Gandhi: ‘‘పాపం రాష్ట్రపతి’’.. సోనియా గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..

నిఫ్టీలో టాటా కన్స్యూమర్, ట్రెంట్, భారత్ ఎలక్ట్రానిక్స్, నెస్లే ఇండియా, ఎల్ అండ్ టీ అతిపెద్ద లాభాలు సాధించగా.. భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, జెఎస్‌డబ్ల్యు స్టీల్ నష్టపోయాయి.

ఇది కూడా చదవండి: Antarctica: మంచు మధ్య ప్రవహిస్తున్న రక్తపు జలపాతం? అసలేంటి ఈ మిస్టరీ?