Site icon NTV Telugu

Stock Market: రోజంతా ఊగిసలాట.. చివరకు స్వల్ప నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Stock Market

Stock Market

దేశీయ స్టాక్‌మార్కెట్లు ఇవాళ ఒడిదొడుకుల మధ్య ఫ్లాట్‌గా ముగిసాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు అనంతరం కోలుకున్నట్లే కనిపించాయి. ఆరంభంలో ఫ్లాట్‌ ఉన్నప్పటికీ ఆ తరువాత కొనుగోళ్ల సందడి నెలకొంది. రోజంతా లాభ నష్టాల మధ్య ఊగిసలాడిన కీలక సూచీలు చివరికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్‌ 8 పాయింట్లు కోల్పోయి స్పల్ప నష్టంతో 53018 వద్ద, నిఫ్టీ 18 పాయింట్లు నష్టపోయి 15780 వద్ద ముగిశాయి.

ఆటో, పీఎస్‌యు బ్యాంక్, రియల్టీ, మెటల్ షేర్లు నష్టపోగా, పవర్ , బ్యాంకింగ్ పేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. యాక్సిస్‌ బ్యాంకు, ఎస్‌బీఐ, బ్రిటానియా, దివీస్‌ ల్యాబ్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. బజాజ్‌ ఆటో, సిప్లా, ఐషర్‌ మోటార్స్‌, బీపీసీఎల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ నష్టపోయాయి. రంగాల వారీగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్, ఆటో, రియల్టీ, లోహరంగ షేర్లు కాస్త కుంగాయి.

Exit mobile version