Site icon NTV Telugu

Stock Market: ‘బ్లాక్ మండే’.. స్టాక్ మార్కెట్ అల్లకల్లోలం

Stockmarket

Stockmarket

ట్రంప్ వాణిజ్య యుద్ధం కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్‌‌ సోమవారం అల్లకల్లోలం అయిపోయింది. ఉదయం మార్కెట్‌ ప్రారంభం కాగానే భారీ నష్టాలతో ప్రారంభమైంది. సూచీలన్నీ భారీగా పతనం అయిపోయాయి. దీంతో ప్రస్తుతం మార్కెట్ అంతా అస్తవ్యస్థంగా మారిపోయింది. మార్కెట్లు ప్రారంభమైన  పావుగంటలోనే బీఎస్‌ఈలో దాదాపు రూ.12 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది.

ప్రస్తుతం సెన్సెక్స్ 2,847 పాయింట్లు నష్టపోయి 72, 517 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 923 పాయింట్ల నష్టంతో 21. 981 దగ్గర కొనసాగుతోంది. దాదాపు 52 వారాల కనిష్ట స్థాయికి సూచీలు పడిపోయాయి. నిఫ్టీలో ట్రెంట్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, ఓఎన్‌జీసీ ప్రధానంగా నష్టాల్లో సాగుతున్నాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి, ఐటీ, మెటల్ ఒక్కొక్కటి 7 శాతం పడిపోగా.. ఇక బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 6 శాతం తగ్గాయి.

ఇది కూడా చదవండి: Mohammed Siraj: మనస్థాపానికి గురయ్యా.. జీర్ణించుకోలేకపోయా.. కష్టపడ్డాను: సిరాజ్

Exit mobile version