Site icon NTV Telugu

Stock Market: వరుసగా మూడోరోజూ నష్టాలే

Bse1

Bse1

వరుసగా మూడవరోజూ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో పాటు, మరో ఆర్థిక సంక్షోభం రాబోతోందనే అంచనాలు మార్కెట్లను ప్రభావితం చేశాయని మార్కెటింగ్ నిపుణులు చెబుతున్నారు. ఈరోజు ఉదయం నష్టాల్లోనే ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత కాస్త కోలుకున్నాయి. అయితే వెంటనే మళ్లీ పతనంతో ముందుకు నడిచాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 153 పాయింట్లు కోల్పోయింది. 52,693కి సెన్సెక్స్ పడిపోయింది. నిఫ్టీ 42 పాయింట్లు నష్టపోయి 15,732 వద్ద స్థిరపడింది.

భారతి ఎయిర్ టెల్, ఎన్టీపీసీ అల్ట్రాటెక్ సిమెంట్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫోసిస్ లాభాల్లో నడిచాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, రిలయన్స్ , మారుతి, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ నష్టాలు చవిచూశాయి. ఇదిలా వుంటే దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు పెరగడంతో భారత్ పై దిగుమతి భారం పడుతోంది. మే 21న కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించగా అప్పటి నుంచి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు మాత్రమే వ్యాట్ తగ్గించాయి.

హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.82గా ఉంది. విజయవాడలో పెట్రోల్ లీటరు రూ.111.81 గా వుంది. అలాగే, డీజిల్ లీటరు రూ. రూ.99.56గా వుంది, విశాఖపట్నంలో మాత్రం పెట్రోల్ ధర 80పైసలు తగ్గింది. అక్కడ లీటరు ధర రూ.110.48 గా ఉంది. డీజిల్ పై 74 పైసలు తగ్గి లీటరు రూ.98.27గా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు, కర్నాటకల్లో చమురుధరలు తక్కువగా వున్నాయి. చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 102.63, డీజిల్ రూ. 94.24 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ. 101.94 కాగా, డీజిల్‌ రూ. 87.89గా వుంది.

Air India : ఎయిర్‌ ఇండియాకు రూ.10 లక్షలు జరిమానా..

Exit mobile version