Site icon NTV Telugu

Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

Stock

Stock

Stock Market: భారత్- పాకిస్తాన్ మద్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో గత వారం రోజుల పాటు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. కానీ, శనివారం ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడంతో.. భారత్ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పరుగులు పెడుతున్నాయి. సోమవారం ఉదయం నుంచే భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. అన్ని రంగాలూ షేర్ మార్కెట్ లాభాల్లో కదలాడుతుంది. కాగా, స్టాక్‌ మార్కెట్లు ముగిసే సమయానికి భారీ లాభాల్లో ఉంది. సుమారు 2,950 పాయింట్ల లాభంతో 82, 404 దగ్గర ముగిసింది సెన్సెక్స్‌. ఇక, 912 పాయింట్ల లాభంలో 24,920 వద్ద నిఫ్టీ ముగిసింది.

Read Also: Manoj Naravane: ‘‘యుద్ధం అంటే రొమాంటిక్ కాదు, మీ బాలీవుడ్ సినిమా కాదు’’: మాజీ ఆర్మీ చీఫ్

అయితే, ఒకే రోజు స్టాక్‌ మార్కెట్లు సుమారు 3 శాతం లాభాలకు పైగా పెరుగుదల కనిపించింది. భారత్- పాక్‌ మధ్య కాల్పుల విరమణతో మార్కెట్‌లో జోష్ పెరిగింది. మరోవైపు, అమెరికా- చైనా మధ్య కూడా టారిఫ్ చర్చలు సానుకూలంగా ముగిసాయి. దీంతో ఇరు దేశాల మధ్య చర్చలు ఫలప్రదం కావడంతో.. యూఎస్- చైనా దేశాలు 90 రోజుల పాటు తమ టారిఫ్‌లను 115 శాతం మేర తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాయి. ప్రస్తుతం అమెరికా దిగుమతుల మీద చైనా 125 శాతం సుంకాలను విధిస్తోంది. తాజా ఒప్పందంతో 115 శాతం తగ్గింపు అంటే అమెరికా దిగుమతులపై చైనా పన్నులు పది శాతానికి దిగి రానున్నాయి. ఇక, చైనా దిగుమతులపై అమెరికా 145 శాతం పన్నులను విధించినప్పటికీ.. తాజా ఒప్పందంతో ఆ పన్నులు 30 శాతానికి దిగి వస్తాయి.

Exit mobile version