Site icon NTV Telugu

Stock Market: గ్లోబల్ టారిఫ్‌ల రద్దు ఎఫెక్ట్.. భారీ లాభాల్లో సూచీలు

Stockmarket (1)

Stockmarket (1)

దేశీయ మార్కెట్ భారీ లాభాలతో దూసుకుపోతుంది. ఈ వారం ప్రారంభంలో మార్కెట్‌ భారీ లాభాలతో ప్రారంభమైంది. ఇటీవల అమెరికా సుప్రీంకోర్టు గ్లోబల్ టారిఫ్‌లను రద్దు చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. దీంతో మన మార్కెట్‌ లాభాల్లో పరుగులు పెడుతోంది. ఇన్లెస్టర్ల పంట పడుతోంది. అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 491 పాయింట్లు లాభపడి 83,329 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 154 పాయింట్లు లాభపడి 25,726 దగ్గర కొనసాగుతోంది.

నిఫ్టీలో యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మాక్స్ హెల్త్‌కేర్, టెక్ మహీంద్రా, హెచ్‌యుఎల్ ప్రధాన లాభాలను ఆర్జించగా.. సిప్లా, ఒఎన్‌జీసీ, ఆసియన్ పెయింట్స్, కోల్ ఇండియా, బజాజ్ ఫిన్‌సర్వ్ నష్టపోయాయి. ఆటో, పీఎస్‌యూ బ్యాంక్ ఒక్కొక్కటి 1 శాతం పెరగడంతో అన్ని రంగాల సూచీలు ఆకుపచ్చగా ట్రేడవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Mukul Roy: మాజీ రైల్వే మంత్రి ముకుల్ రాయ్ కన్నుమూత

గత శుక్రవారం ట్రంప్‌కు అమెరికా సుప్రీంకోర్టు గట్టి షాకిచ్చింది. ప్రపంచ దేశాలపై విధించిన టారిఫ్‌లను రద్దు చేసింది. దీంతో ట్రంప్ సర్కార్‌కు పెద్ద దెబ్బ తగిలింది. న్యాయమూర్తులు.. మూర్ఖులంటూ ట్రంప్ ధ్వజమెత్తారు. అలా ధర్మాసనం మొట్టికాయలు వేసిందో లేదో తగ్గేదేలేదంటూ అన్ని దేశాలపై 10 శాతం సుంకం విధించారు. అనంతరం ఆ సుంకాలను 15 శాతానికి పెంచేశారు.

ఇది కూడా చదవండి: US-Iran: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు.. ఇరాన్‌కు తరలివెళ్తున్న అమెరికా బలగాలు

Exit mobile version