Corona effect: భారీగా పెరగనున్న టీవీలు, స్మార్ట్ ఫోన్ ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా పుట్టినిల్లు చైనాలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. చైనాలోని టెక్ హబ్ ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన షెన్‌జెన్‌లో కూడా కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఒకవేళ షెన్‌జెన్‌లో లాక్‌డౌన్ విధిస్తే.. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు భారీగా పెరుగుతాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ప్రపంచంలోని అతిపెద్ద ఎలక్ట్రానిక్ ప్రొడక్టులను సరఫరా చేసే నగరాల్లో షెన్‌జెన్ ఒకటి. అక్కడి నుంచే 20 నుంచి 50 శాతం ఉత్పత్తులు భారత్‌కు దిగుమతి అవుతుంటాయి.
షెన్‌జెన్‌లో కరోనా కేసులు మరికొన్నిరోజులు ఇలాగే కొనసాగితే అధికారులు లాక్‌డౌన్ విధిస్తారని ప్రచారం జరుగుతోంది. అక్కడ లాక్ డౌన్ మూడు వారాలు దాటితే మన దేశంలోకి వచ్చే ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతులపై ప్రభావం పడుతుందని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ రీసెర్చ్ డైరెక్టర్ నవ్‌కేంద్రసింగ్ వెల్లడించారు. ఇప్పటికే ప్రపంచదేశాలు తీవ్రమైన చిప్ కొరతను ఎదుర్కోవడంతో స్మార్ట్‌ఫోన్ కంపెనీల ఉత్పత్తి భారీగా పడిపోయింది. ప్రస్తుతం చైనాలో కరోనా విజృంభిస్తుండటంతో స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌టీవీల ధరలు పెరిగే అవకాశం ఉందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ అన్నారు.
Also Read
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్‌ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
- ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
- RBI Report: తీవ్ర ద్రవ్యోల్బణంలో తెలంగాణ.. ఆర్బీఐ నివేదిక
- BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!