Interest Rates: SSY, PPF వడ్డీ రేట్లు ఖరారు చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఏప్రిల్ 1 నుంచి అమలు..
- కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం..
- PPF, SSY వడ్డీ రేట్లు ఖరారు..
- ఎనిమిదవ త్రైమాసికంలో కూడా వడ్డీ రేట్లు యథాతథం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టే వారికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి (ఏప్రిల్ – జూన్) సంబంధించి వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకూడదని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. అంటే గతంలో ఉన్న వడ్డీ రేట్లే ఈ మూడు నెలలు కూడా కొనసాగుతాయి.
వడ్డీ రేట్లు ఎందుకు మారలేదు..?
Also Read
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
- ATF Price Hike: విమాన ప్రయాణికులకు షాక్.. జెట్ ఫ్యూయల్ ధరలు పెంపు..
సాధారణంగా ద్రవ్యోల్బణం, మార్కెట్ పరిస్థితులను బట్టి ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది. అయితే.. వరుసగా ఎనిమిదవ త్రైమాసికంలో కూడా వడ్డీ రేట్లను యధాతథంగా ఉంచారు. చివరిసారిగా 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఈ రేట్లలో మార్పులు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వడ్డీ రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి.
కేంద్రం విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం వివిధ పథకాల వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి. సుకన్య సమృద్ధి యోజన పథకంలో భాగంగా.. ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఉద్దేశించిన ఈ పథకానికి అత్యధికంగా 8.2 శాతం వడ్డీ లభిస్తుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) పథకంలో భాగంగా.. దీర్ఘకాలిక పొదుపు కోసం ఎంతో మంది ఎంచుకునే ఈ పథకానికి 7.1 శాతం వడ్డీ కొనసాగుతుంది.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) పథకంలో.. వృద్ధులకు భరోసా ఇచ్చే ఈ పథకానికి 8.2 శాతం వడ్డీ లభిస్తుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) పథకంపై 7.7 శాతం వడ్డీ రానుంది.
కిసాన్ వికాస్ పత్ర (KVP) పథకంపై 7.5 శాతం వడ్డీ ఇస్తున్నారు. ఈ పథకంలో మీరు పెట్టిన పెట్టుబడి 115 నెలల్లో రెట్టింపు అవుతుంది. మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS) పథకం విషయానికి వస్తే.. ప్రతినెలా ఆదాయం కోరుకునే వారికి 7.4 శాతం వడ్డీ అందుతుంది. పోస్టాఫీసు సేవింగ్స్ పథకంలో సాధారణ పొదుపు ఖాతాలపై 4 శాతం వడ్డీ లభిస్తుంది.
పెట్టుబడిదారులకు కలిగే ప్రయోజనం..
మార్కెట్లో బ్యాంక్ వడ్డీ రేట్లు మారుతున్నప్పటికీ.. ప్రభుత్వ పథకాల్లో వడ్డీ రేట్లు స్థిరంగా ఉండటం వల్ల సామాన్యులకు, రిటైర్డ్ ఉద్యోగులకు తమ రాబడిపై ఒక స్పష్టమైన భరోసా ఉంటుంది. సురక్షితమైన పెట్టుబడితో పాటు పన్ను మినహాయింపులు కూడా లభించడం వల్ల చాలా మంది ఇప్పటికీ పోస్టాఫీసు, ప్రభుత్వ పొదుపు పథకాలనే నమ్ముకుంటున్నారు.
తాజావార్తలు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
-
AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
-
OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?